Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూల్స్ అంటూ క్లాసులు పీకే కౌషల్‌కు బిగ్ బాస్ వార్నింగ్.. గుడ్ల దొంగ ఇతనేనా

నిన్నటి ఎపిసోడ్‌లో కౌషల్ కౌశల్ పేపర్ మీద ఏదో రాసుకుంటున్నాడు. ఇంతలో దీన్ని గమనించిన బిగ్ బాస్ ఏమి రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారని కౌషల్‌ను ప్రశ్నించగా బిగ్ బాస్ హౌస్‌లో నేటితో వంద రోజులు పూర్తయ్యాయ

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (11:37 IST)
నిన్నటి ఎపిసోడ్‌లో కౌషల్ కౌశల్ పేపర్ మీద ఏదో రాసుకుంటున్నాడు. ఇంతలో దీన్ని గమనించిన బిగ్ బాస్ ఏమి రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారని కౌషల్‌ను ప్రశ్నించగా బిగ్ బాస్ హౌస్‌లో నేటితో వంద రోజులు పూర్తయ్యాయని, ఈ వంద ఎపిసోడ్‌లలో జరిగిన టాస్క్‌లు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయ్యారు, అలాగే హౌస్‌మేట్స్ మీద తనకున్న అభిప్రాయాలను రాసుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు.
 
దీనిపై సీరియస్ అయిన బిగ్ బాస్ ఇలా చేయడం హౌస్‌లోని నియమాలకు విరుద్ధం, వంద రోజులు గడిచిన తర్వాత కూడా ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. గీత మైక్‌కి చేయి అడ్డు పెట్టి గుసగుసలాడుతోంది, అలాగే మిగతా సభ్యులు కూడా రూల్స్ సరిగ్గా పాటించడం లేదని, ఇలాగే చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు బిగ్ బాస్.
 
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఇచ్చిన టాస్క్ ప్రకారం రిపోర్టర్, ఫోటోగ్రాఫర్‌గా ఒక్కొక్కరు ఉంటూ అక్కడ జరుగుతున్న విషయాలను కవర్ చేసి, వాటిని స్టోరీలుగా నివేదించాలని చెప్పారు. దీని కోసం నిఘా పెట్టిన రోల్ రైడా, కౌషల్ రాత్రిపూట గుడ్లు దొంగతనం చేసి, ఎవరికీ తెలియకుండా తింటున్నాడని తెలుసుకుని నిర్ఘాంతపోతాడు. దీన్ని ఎలాగైనా తన కెమెరాతో బయటపెడతానని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments