Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

మీరు చాలా డేంజరండి.. అలీగారూ.. సమంత

ప్రముఖ హాస్యనటుడు అలీ హాస్యం పండించడంతో పాటు వివాదాలను కూడా అప్పుడప్పుడు కొనితెచ్చుకుంటాడు. గతంలో ఇలాంటి వివాదాల జోలికెళ్లి అలీ.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈసారి అలీకి అటువంట

Advertiesment
Alitho Saradaga
, ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (14:18 IST)
ప్రముఖ హాస్యనటుడు అలీ హాస్యం పండించడంతో పాటు వివాదాలను కూడా అప్పుడప్పుడు కొనితెచ్చుకుంటాడు. గతంలో ఇలాంటి వివాదాల జోలికెళ్లి అలీ.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈసారి అలీకి అటువంటి మరో పరిస్థితి ఎదురైంది. అలీ ఈసారి టాలీవుడ్ అందాల రాశి సమంతను అడిగిన ప్రశ్నకు ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
 
తాజాగా సమంత తను నటించిన ''యూటర్న్'' సినిమా ప్రమోషన్స్ కోసం అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఓ షోకి హాజరైంది. సోమవారం ఈ షో టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అలీ తన చిలిపి ప్రశ్నలతో సమంతను కట్టిపారేశాడు. అయితే అలీ అడిగిన ప్రశ్నలపై సామ్ ఫ్యాన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో చైతూని ఏమని పిలుస్తారని సమంతను అలీ ప్రశ్నించాడు. అందుకు సమంత సిగ్గుపడుతూ బేబీ అని సమాధానం ఇచ్చింది. ఈ ప్రశ్నకు సమంత పెద్దగా ఇబ్బంది పడలేదు. 
 
మరో సంధర్భంలో 'అత్తారింటికి దారేది' సినిమాలో కామెడీ ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ స్వామీ నదికి పోలేదా..? మాటను ప్రస్తావిస్తూ మరి నాగ చైతన్య నదికి పోలేదా..? అని ప్రశ్నించాడు అలీ. దానికి సమంతా.. చైతు నదికి వెళ్లడని తన వద్దే ఉంటాడని చెప్పింది. ఆపై మీ పిల్లలు ఎలా వున్నారు.. అని అలీ అడిగిన ప్రశ్నకు సమంత ఇబ్బంది పడింది. మనం సినిమా సమయంలో మనం డిస్కస్ చేసుకున్నాం అని అలీ ఏదో చెప్తుంటే.. సమంత మాత్రం.. అలీగారూ మీరు చాలా డేంజరండి అంటూ కామెంట్ చేసింది.
 
ప్రస్తుతం అలీ అడిగిన ప్రశ్నపై సమంత అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడగాలో కూడా తెలియదా అంటూ అతడిని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టఫ్‌గా కనిపిస్తారు కానీ, మాట వింటారు. పర్వాలేదు...?