Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అకాడెమీ జాబితాలో బాలీవుడ్ హీరోలు - హీరోయిన్లు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (18:09 IST)
ఆస్కార్ అకాడెమీ ఆహ్వానితుల జాబితాలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్ల పేరు చోటుదక్కించుకున్నాయి. నిజానికి ఈ యేడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదాపడింది. ఈ వేడుకలను 2021, ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 
 
అయితే, ఆస్కార్ అవార్డులను అందించే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS), ప్ర‌తి ఏడాది అనేక మంది ప్రపంచ సినీ ప్రముఖులను అకాడమీలోకి ఆహ్వానిస్తుంది. 2020 సంవ‌త్స‌రానికిగాను అకాడమీ జాబితాలో చేర‌బోయే స‌భ్యుల వివ‌రాల‌ని ఏఎంపీఏఎస్ ప్రచురించింది. 
 
ఇందులో భాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన హృతిక్ రోష‌న్‌, అలియా భ‌ట్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్ నీతా లుల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ప్రియ స్వామినాథ‌న్‌, వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూస‌ర్స్ విషాల్ ఆనంద్ (వార్‌, భార‌త్‌), సందీప్ క‌మ‌ల్‌ (పానిప‌ట్, జ‌ల్‌) త‌దితరులు ఈ ఏడాది అకాడ‌మీ స‌భ్యులుగా ఉంటార‌ని పేర్కొన్నారు. మొత్తం 819 మంది స‌భ్యుల‌ని జాబితాలో చేర్చ‌గా, వివిధ క్యాట‌గిరీలు ఆధారంగా ఎంపిక చేశారు.
 
గ‌తంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ సినీ ప్రముఖులు ఏఆర్ రెహ్మాన్, ఇర్ఫాన్ ఖాన్, రేసుల్ పూకుట్టి, ఫ్రీడా పింటో, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే త‌దితరులు అకాడమీ స‌భ్యులుగా ఉన్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments