Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు, తమిళ భాషల్లో వైభవ్, పార్వతి నాయర్ జంటగా నటించిన ఆలంబన

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (17:46 IST)
Vaibhav
సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ నటించిన తాజా సినిమా 'ఆలంబన'. ఆయన సరసన పార్వతి నాయర్ కథానాయికగా నటించారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. పారి కె విజయ్ దర్శకత్వం వహించారు. కోటపాడి రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. డిసెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
 
'ఆలంబన' కథ విషయానికి వస్తే... హీరో అపర కుబేరుల ఇంట్లో జన్మిస్తాడు. కానీ, దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబం ఆస్తి అంతటినీ కోల్పోతుంది. రాజభవనం లాంటి ఇంటి నుంచి నడిరోడ్డు మీదకు కట్టు బట్టలతో వచ్చేస్తారు. అటువంటి పరిస్థితులో ఓ శుభ ముహూర్తంలో హీరో జీవితంలోకి జీని అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? తనకు ఎదురైన పరిస్థితులను జీనీ ఏ విధంగా ఎదుర్కొన్నాడు? అనేది వెండితెరపై చూడాలి. 
 
''ప్రేక్షకులకు వినోదం అందించే చిత్రమిది. హీరోకి, వాళ్ళ కుటుంబానికి ఎదురయ్యే పరిస్థితులు కడుపుబ్బా నవ్విస్తాయి. వినోదంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ కూడా ఉంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి'' అని చిత్ర బృందం పేర్కొంది.
 
వైభవ్, పార్వతి నాయర్ జంటగా నటించిన ఈ సినిమాలో మురళీ శర్మ, మునీష్ కాంత్, దిండిగల్ ఐ లియోని, పాండియరాజన్, ఆనందరాజ్, కబీర్ సింగ్, కాళీ వెంకట్, రోబో శంకర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి  కొరియోగ్రఫీ : షెరీఫ్, ఎడిటర్ : సాన్ లోకేష్, స్టంట్ డైరెక్టర్ : పీటర్ హెయిన్, ఆర్ట్ డైరెక్టర్ : గోబీ ఆనంద్, సినిమాటోగ్రాఫర్ : వినోత్ రతిన్ సామి, మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ, ప్రొడక్షన్ హౌస్ : కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ - కేజేఆర్ స్టూడియోస్, రిలీజ్ : గంగ ఎంటర్టైన్మెంట్స్‌, డైరెక్షన్ : పారి కె విజయ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త సీఎంల మధ్య ఇదే తొలి అధికారిక సమావేశం.. చంద్రబాబు లేఖ

మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఏఎస్ఐ.. Video వైరల్

దేవుడి ముందు లొంగిపోయాడు.. అందుకే మరణ శిక్ష రద్దు : ఒరిస్సా హైకోర్టు

మీరు చేసిన నినాదాలతో ప్రకృతి కూడా బయపడిపోయింది.. అందుకే డిప్యూటీ సీఎంను చేసింది : పవన్ కళ్యాణ్ (Video)

ఇపుడు 11 సీట్లు వచ్చాయి.. రేపు ఒక్కటే రావొచ్చు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments