Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కల్యాణమస్తు నుండి విడుదలైన ఏమైందో ఏమైందో .. పాటకు స్పందన

Shekhar Varma, Vaibhavi
, సోమవారం, 13 మార్చి 2023 (17:15 IST)
Shekhar Varma, Vaibhavi
శేఖర్ వర్మ, వైభవి జంటగా  ఓ. సాయి  దర్శకత్వంలో  బోయపాటి రఘుబాబు నిర్మించిన  చిత్రం "కళ్యాణమస్తు". ఈ సినిమా నుండి ఇంతకుముందు విడుదల చేసిన ముక్కు పుడక లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రేక్షకులు ఆ పాటను మరువకముందే తాజాగా ఈ సినిమా నుండి "ఏమైందో  ఏమైందో" అని సాగే మరో మంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
 
ఏమైందో ఏమైందో ఏనాడు లేనేలేని  రంగుల కలలే నింపేసావే కన్నుల్లో నా.. రంగుల కలలే నింపేసావే కన్నుల్లోనా.. అని సాగే ఈ పాటకు లిరిసిస్ట్ అలరాజు చక్కని లిరిక్స్ అందించాడు.సింగర్స్ లిప్సిక, హరిచరణ్ లు  ఆలపించిన  ఈ పాటకు ఆర్. ఆర్. ధ్రువన్  అద్భుతమైన సంగీతం అందించారు.సినిమాటోగ్రాఫర్ మల్లికార్జున్ నరగాని  చక్కటి విజువల్స్ ఇచ్చారు
 
 చిత్ర నిర్మాత బోయపాటి రఘుబాబు.. ఈ సినిమా నుండి ఇంతకుముందు మేము విడుదల చేసిన పాటలకు ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇందులో  హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కూడా పోటీ పడి నటించారు.టెక్నిషియన్స్, నటీ నటులు అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మా సినిమా పాటలను టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాదికి దాస్ కా ధమ్కీ తో వస్తున్నా..హిట్ కొడుతున్నా: విశ్వక్ సేన్