Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్కార్ అంటే ఏంటో తెలియదు.. కానీ ఆనందంగా ఉంది.. బెల్లీ - బొమ్మన్

bellie bomman
, సోమవారం, 13 మార్చి 2023 (16:53 IST)
తమకు ఆస్కార్ అవార్డు అంటే ఏంటో తెలియదని, కానీ ప్రతి ఒక్కరూ అభినందించడం ఎంతో ఆనందంగా ఉందని మావటి దంపతులైన బొమ్మన్ బెల్లీ అంటున్నారు. దిక్కులేని ఏనుగులను ఆదరించి, వాటి సంరక్షణ చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కిన భారతీయ లఘుచిత్రం ది ఎలిఫెంట్ విష్పరర్స్‌కు ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు వరించింది. 
 
ఇంత గొప్ప అవార్డు రావడంపై దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో గర్వంగా భావిస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ లఘుచిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన బెల్లీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
 
అయితే, తనకు అసలు ఆస్కార్‌ అవార్డు అంటే తనకు తెలియదని.. అయినప్పటికీ తమకు అభినందనలతో ముంచెత్తడం ఎంతో సంతోషంగా ఉందని బెల్లీ స్పందించారు. ఇక ఇందులో హీరోగా నటించిన ఆమె భర్త బొమ్మన్‌ గురించి అడగగా.. సమీప పట్టణంలో తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తెచ్చేందుకు వెళ్లారని, దానికి సేవలు చేసేందుకు ఎంతో ఉత్సాహంగా వేచిచూస్తున్నానని చెప్పడం విశేషం.
 
తమిళనాడులోని ముదుమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్‌ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కింది. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన ఈ దంపతులే పాత్రలుగా ఈ కథ రూపుదిద్దుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనసుకి నచ్చిన సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నా : మాళవిక నాయర్