Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ్ అరుదైన రికార్డు : ప్రపంచ సంపన్న నటుల జాబితాలో స్థానం!

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (09:35 IST)
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ అత్యధిక సంపన్న నటుల జాబితాలో ఆయన చోటుదక్కించుకున్నారు. అదీకూడా బాలీవుడ్ చిత్రపరిశ్రమ నుంచి ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే ఆరో స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్-10 నటుల జాబితాను ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసింది.
 
ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క అక్షయ్ కుమార్‌కు మాత్రమే చోటుదక్కడం విశేషం. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న అక్షయ్.. ఈసారి రెండు స్థానాలు దిగజారాడు. అక్షయ్‌కుమార్‌ 2019 జూన్‌ 2020 జూన్‌ మధ్య రూ.362 కోట్లు (48.5 మిలియన్‌ డాలర్లు) సంపాదనతో.. పోర్బ్స్‌ టాప్‌-10 జాబితాలో అక్షయ్‌కుమార్‌ 6వ స్థానంలో నిలిచాడు. 
 
అక్షయ్ కుమార్ సినిమాల ద్వారా కంటే ప్రకటనల ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్టు ఫోర్బ్స్ పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ సిరీస్ "ది ఎండ్ షో"లో నటిస్తున్న అక్షయ్ 10 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. 
 
కాగా, గతేడాది అక్షయ్‌కుమార్‌ మిషన్‌ మంగళ్‌, హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌న్యూస్‌ చిత్రాలతో బాక్సాపీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు అక్షయ్‌కుమార్‌. సినిమాతో పలు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులను కూడా ప్రమోట్‌ చేస్తున్నాడు అక్షయ్‌కుమార్‌. 
 
ఇకపోతే, ఈ జాబితాలో గతేడాది మొదటి స్థానంలో నిలిచిన హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ ఈసారి కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 87.5 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. డెడ్‌పూల్ స్టార్ అయిన ర్యాన్ రెనాల్డ్ 71.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మార్క్ వాల్బర్గ్, బెన్ అఫ్లెక్, విన్ డీజిల్ నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments