Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ సురేష్ హీరోగా న‌టిస్తున్న అక్ర‌మ్ టీజ‌ర్ విడుద‌ల‌

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (18:25 IST)
Ram Suresh, suresh kondeti, saideep, anilkumar
రామ్ సురేష్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `అక్ర‌మ్‌. రాజ‌ధాని అమ‌రావ‌తి మూవీస్ ప‌తాకంపై ఎం.వి.ఆర్‌. అండ్ విస‌కోటి మార్కండేయులు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం టీజ‌ర్ బుధ‌శారంనాడు హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్‌ల్యాబ్ ప్రివ్యూ థియేట‌ర్‌లో విడుద‌లైంది. టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కొత్త‌వారైనా రామ్ సురేష్ న‌ట‌న హైలైట్‌గా నిలిచింది. ఇదే వేదిక‌పై ఓ పాట‌ను చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు సాయిదీప్‌, కెమెరామెన్ అనిల్‌కుమార్ లాంఛ్ చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ, సినిమాపై ప్యాష‌న్‌తోనే వ‌చ్చాం. మంచి సినిమా తీశామ‌ని భావిస్తున్నామ‌ని అన్నారు.
 
క‌థానాయ‌కుడు రానా సురేష్ మాట్లాడుతూ, ఇందులో డైలాగ్స్‌లు కూడా రాశాను అంటూ.. భారీ డైలాగ్‌ను వినిపించారు. క‌థ కూడా నేనే రాశాను. రావ‌ణునికి మించిన‌ అహం రానాలో వుంటుంది. రానా, అక్ర‌మ్ అనేవారు ఎవ‌రు? అనేది సినిమాలో చూస్తే అర్థ‌మ‌వుతుంది. త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల చేస్తాం. అందులో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం. ఇందులో గీత ర‌చ‌యిత కొత్త కొత్త డైలాగ్‌లు కూడా రాశారు. క‌థ‌లో అన్ని కోణాలున్నాయి. యాక్ష‌న్‌, సోషియో ఫాంట‌సీ అనొచ్చు. చూసేవారికి థ్రిల్ క‌ల‌గ‌జేస్తుంది. యాక్ష‌న్ సీన్ కోసం జాగ్వార్ కార్లు లొకేష‌న్‌లో వాడాం. తెలుగు సినిమాలో భారీ సినిమా రాజ‌మౌళి వంటి వారు నిర్మించినా కొత్త వారు అనేస‌రికి చిన్న చూపు వుంటుంది. ఆ చూపు వుండ‌కూడ‌ద‌నే నేను ఈ రంగంలోకి వ‌చ్చాను. చిన్న సినిమాలో కంటెంట్ వుంటుంది. న‌న్ను టాలీవుడ్ త‌లైవి అని అంటారు. ఆ పేరు నేను పెట్టుకుంది కాదు. కీ.శే.. తుర్ల‌పాటి కుటుంబ‌రావు గారు పెట్టారు. ఫ‌స్ట్ లుక్ చూశాక ఆయ‌న పెట్టిన పేర‌ది. పైన ఎక్క‌డున్నా ఆయ‌న ఆశీస్సులుంటాయ‌ని భావిస్తున్నాను. నేను ఎ.ఎన్‌.ఆర్‌. అభిమానిని. త్వ‌ర‌లో ప్రీరిలీజ్ వేడుక చేయ‌బోతున్నాం. దానికి అక్కినేని నాగార్జున‌గారు హాజ‌రుకానున్నార‌ని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌-  శివ శంక‌ర్‌.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments