Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రీడం ఫైట‌ర్స్ చాలా మంది వుంటారు. కానీ ఎఫెక్ట్ ఒక‌రిపైనే ప‌డుతుంది - మేజ‌ర్ ద‌ర్శ‌కుడు శశి కిరణ్ తిక్క

Advertiesment
Shashi Kiran Tikka,
, బుధవారం, 1 జూన్ 2022 (17:49 IST)
Shashi Kiran Tikka,
డివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం  మేజర్‌.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం  తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌ టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శశి కిరణ్ తిక్క బుధ‌వారంనాడు మీడియాతో స‌మావేశమ‌య్యారు. ఆ వివ‌రాలు.
 
మేజ‌ర్ చిత్రం ఎలా మొద‌లైంది?
అడ‌వి శేస్ వ‌ల్లే మొద‌లైంది. 2010నుంచి మేం స్నేహితులం. నేను అసిస్టెంట్‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నా. త‌ను హీరోగా ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. ఓసారి మాట‌ల్లో మేజ‌ర్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఆ త‌ర్వాత రెండు క‌థ‌లు అనుకున్నాం. కానీ సాధ్య‌ప‌డ‌లేదు. ఆఖ‌రికి 2016లో గూఢ‌చారి మొద‌లు పెట్టాం. అది విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఎవ‌రు సినిమాలు వారివి అనేలా బ్రేక్ తీసుకున్నాం. నేను వేరే నిర్మాణ సంస్థ‌లోకి  వెళ్ళాను. కొన్నాళ్ళ‌కు శేష్‌, స‌హ నిర్మాత శ‌ర‌త్‌, న‌మ్ర‌త‌, సోని సంస్థ‌ను క‌లిపి ఒక వేదిక‌పై తీసుకువ‌చ్చారు. ఆ త‌ర్వాత నాకు ఫోన్ చేసి సినిమా గురించి చెప్పాడు. చేసేయ్ అన్నా. చేయ‌డంకాదు. ఈ సినిమా నువ్వే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలి అన్నాడు. నేను కాస్త బ్రేక్ తీసుకుందాం అనుకున్నాన‌ని చెప్పినా విన‌లేదు. నువ్వే క‌రెక్ట్ అన్నాడు. దాంతో కొంత స‌మ‌యం తీసుకుని చెబుతాను అన్నాను. ఆ స‌మ‌యంలో మేజ‌ర్ గురించి స్ట‌డీ చేశాను. ఆ క్ర‌మంలో ఆ పాత్ర న‌న్ను బాగా ఆక‌ట్టుకుంది. 26/11 ఎటాక్‌లో ఎంతోమందిని కాపాడిన వ్య‌క్తి. ఎంతో నాలెడ్జ్ వున్న ప‌ర్స‌న్‌. దాంతో ఈ విష‌యం అంద‌రికీ తెలియ‌జేయాల‌నే నేనే సినిమా చేస్తాన‌ని శేష్‌తో చెప్పాను. అలా సినిమా మొద‌లైంది.
 
శేష్ కెరీర్ గ్రాఫ్‌లో హీరో, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు వున్నారు క‌దా. అలాంట‌ప్పుడు మీకు కొన్ని కాంప్లెక్స్ వుంటాయి గ‌దా. ఒక‌వైపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ సినిమా పక్క‌న పెట్టి మేజ‌ర్ చేయ‌డానికి కారణం?
 
నేను బ‌య‌ట సినిమా చేయాల‌నుకున్నాను కానీ అది ఇంకా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌కు రాలేదు. రైటింగ్ స్టేజీలోనే వుంది. ఇక మేజ‌ర్ క‌థ‌ను కేవ‌లం సందీప్ త‌ల్లిదండ్రుల కోస‌మే చేశాను. వారిని క‌లిసిన‌ప్పుడు ఈ క‌థ‌కు బ‌య‌ట‌కు తేవాల‌ని అనుకున్నా. సందీప్ గురించి సిబిఎస్‌.సి. టెక్ట్‌బుక్స్‌లో ఒక చాప్ట‌రే వుంది. అందుకే  ఒళ్ళు ద‌గ్గ‌ర‌పెట్టుకుని సినిమా చేయాల‌నుకున్నా.
 
ఈ క‌థ‌పై చాలాకాలం శేష్‌తో ట్రావెల్ అయ్యారు క‌దా? మీకు ఫ్రీడం  ద‌క్కిందా?
 
ఈ సినిమా ఓ బేబిలా జాగ్ర‌త్త‌గా చేశాం. గ‌త‌ను గ‌తంలో ద‌ర్శ‌కుడు కావ‌చ్చు. కానీ ఈ సినిమాకు న‌టుడు మాత్ర‌మే. అందుకే శేష్‌తో గూఢ‌చారి, ఇప్పుడు మేజ‌ర్ చేశాను. ప్ర‌తీ నటుడు ఒక్క‌డో చోట ఓ నిర్ణ‌యం తీసుకోవాలి. అది మేజ‌ర్‌కు శేష్ తీసుకున్నాడు.
 
ఇలాంటి క‌థ‌కు డ్రామా వుంటుంది. అబ్బూరి ర‌వి డైలాగ్స్‌లు ఏ మేర‌కు రీచ్ అయ్యాయంటారు?
నాకు అబ్బూరి ర‌వి బ్యాక్‌బోన్ లాంటివారు. నాతోపాటు క‌థా చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. క‌థ‌, డైలాగ్లో ఆయ‌న పేరు వుంటుంది. హిందీ తెలుగు ఒకేసారి చేశాం. తెలుగు డైలాగ్‌లు ఆయ‌న రాశారు. హిందీ డైలాగ్‌లు అచ్చుత్ రాశారు. కొన్ని ప‌దాలు కొత్త‌గా అనిపిస్తే తెలుగులో వాటికి అనుగుణంగా మెరుగులు దిద్దేవారం. ఇందులో మాట‌లు చాలా స‌హ‌జంగా నీట్‌గా వున్నాయి. వైజాగ్‌లో సినిమా చూస్తూ ఆడియ‌న్స్ డైలాగ్స్‌కు విజిల్స్ వేస్తున్నారు. ఆ రియాక్ష‌న్ రేపు అన్ని చోట్ల వుంటుంద‌నుకుంటున్నాను.
 
26/11లో 17 మంది అధికారులు చ‌నిపోయారు. అందులో కేవ‌లం సందీప్ క‌థే ఎందుకు ఎంపిక చేసుకున్నారు?
స‌హ‌జంగా ఇన్‌స్ప్రిరేష‌న్ ఎలా వ‌స్తుందంటే, ఫ్రీడం ఫైట‌ర్స్ చాలా మంది వుంటారు. కానీ ఎఫెక్ట్ ఒక‌రిపైనే ప‌డుతుంది. మిగిలిన‌వారు త‌క్కువ‌ని కాదు. వారి గురించి కూడా క‌థ‌లు రావ‌చ్చు. శేష్.. సందీప్ పాత్ర‌కు బాగా క‌నెక్ట్ అయ్యాడు. మిగిలిన ఆఫీస‌ర్ల గురించి ముందుముందు ఫిలింమేక‌ర్స్ చేయవ‌చ్చు. ఇక్క‌డ ఎవ‌రూ త‌క్క‌వ‌కాదు.
 
 సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబ సినిమా చూశారా?
నిన్న‌నే బెంగుళూరులో చూశారు. మూడేళ్ళుగా మేం వారిని సంప్ర‌దిస్తూనే వున్నాం. షూట్‌లో మేజ‌ర్ రియాక్ష‌న్ ఫ‌లానా స‌న్నివేశంలో ఎలా వుంటుందో అని అడిగి మ‌రి చేసేవాళ్ళం. వారి అమ్మ‌గారు త‌గువిధంగా సూచ‌న‌లు చేసేవారు. అందుకే ఇంత ఔట్‌పుట్ తీసుకున్న వీరు ఎలా తీశార‌నే ఆస‌క్తి వారికీ వుంటుంది. వారు చూడ‌గానే మెచ్చుకున్నారు.
సందీప్ భార్య గురించి ప్ర‌స్తావించారా?
ఆమె గురించి ఆ త‌ర్వాత విష‌యాలు ఏమీ చెప్ప‌లేదు.
మీరు వారిని అడిగిన‌ప్పుడు ఎమోష‌న్ అయిన సంద‌ర్భాలున్నాయా?
మేజ‌ర్ త‌ల్లిదండ్రులతో చ‌ర్చ‌లో పాల్గొన్న‌ప్పుడు నేను ఇన్‌స్పైర్ అయిన సంద‌ర్భాలున్నాయి. రియ‌ల్ లైఫ్‌లో ఆహ్లాద‌క‌రంగానూ, బాధ‌లు, ఏడుపులు ఇవ‌న్నీ ఆయ‌న‌లో వున్నాయి. మేం కూడా విన్నాక ఫీల్ అయ్యాం. ఈ ఫీలింగ్‌ను య‌థాత‌థంగా న‌టీన‌టుల‌కు ఫీల‌య్యేలా చేశాం. అవి తెర‌పై వ‌చ్చేలా చూశాం. ప్ర‌కాష్‌రాజ్‌, రేవ‌తి పాత్ర‌లు చూస్తే మీకే తెలుస్తుంది. వారు ఫీల‌యి చేశారు. చూసేవారికి కంట‌త‌డి పెట్టిస్తుంది. 
 
 గూఢ‌చారి కంటే మేజ‌ర్ బ‌డ్జెట్ ప‌రంగా ఎక్కువ‌వ క‌దా. ఛాలెంజ్ అనిపించిందా?
గూఛ‌చారి అనేది నేచుర‌ల్ లొకేష‌న్‌లో చేశాం. కానీ మేజ‌ర్ అనేది స్టార్ హోట‌ల్‌లో చూపించాలి. 1990 నాటి హోట‌ల్స్‌. అందుకే హైద‌రాబాద్‌లోని చాలా హోట‌ల్స్‌లో చేశాం. రామోజీ ఫిలింసిటీలో ఏడు సెట్లు వేశాం. 
సినిమా లిబ‌ర్టీని ఎంత‌వ‌ర‌కు తీసుకున్నారు?
సినిమాప‌రంగా కొన్ని తీసుకున్నాం. యాక్ష‌న్ చాలా జాగ్ర‌త్త‌గా చేయాల్సి వ‌చ్చింది. అహ్మ‌దాబాద్‌, ల‌క్నో వంటి చోట్ల యాక్ష‌న్ తీశాం. 
తాజ్ హోట‌ల్‌లో షూట్ చేశారా?
అక్క‌డ ప‌ర్మిష‌న్ ఇవ్వ‌రు. అందుకే తాజ్ హోట‌ల్‌లోని బ్లాక్ లాగా కొన్ని సెట్లు వేసి తీశాం. కోవిడ్ వ‌ల్ల కొంత ఆల‌స్య‌మైంది. 
ముందుగానే సినిమా అంద‌రికీ చూపించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది?
మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌.. శ‌ర‌త్‌, శేష్ డిజైడ్ చేశారు. పైర‌సీ వుంటుందేమోన‌ని అనుమానం కూడా వ‌చ్చింది. దాన్ని కంట్రోల్ చేసేలా ఫోన్లు ముందుగానే తీసుకున్నాం. 
 కానీ బ‌య‌ట ఈ సినిమాకు అంత బ‌జ్ రాలేదే?
సోష‌ల్ మీడియాలో త‌గిన విధంగానే బ‌జ్ వ‌చ్చింది. మేం మ‌ల‌యాళంలో షో వేయ‌లేదు. అక్క‌డ పైర‌సీ ప్రాబ్ల‌మ్‌.
 
 పాన్ ఇండియా సినిమా కొల‌మానాలు ఏమిటి?
ఎనీ ఫిలిం మేక‌ర్ త‌మ సినిమా అంద‌రూ చూడాల‌నే అనుకుంటారు. గోవా పిలిం పెస్టివ‌ల్‌లోనూ త‌న సినిమాలో అంద‌రూ చూడాల‌నే కోరిక మేక‌ర్‌కు వుంటుంది. క‌థ‌లు యూనివ‌ర్శ‌ల్‌. అందుకే పాన్ ఇండియా సినిమాగా మారిపోయాయి. అది నిర్మాత‌ను బ‌ట్టి వుంటుంది.
 
కెరీర్ మొద‌ట్లోనే బ‌యోపిక్ చేయ‌డం క‌ష్టం అనిపించిందా?
మేజ‌ర్ చేయాల‌నే చేశాను. గూఢ‌చారి అనేది ఫింక్ష‌న్ అది ఎలాగైనా చేయ‌వ‌చ్చు. మేజ‌ర్‌కు మాత్రం ప‌రిమితులు వుంటాయి. అలానే చేయాలి. 31 ఏళ్ల మేజ‌ర్ జ‌ర్నీ, ఆయ‌న చుట్టు ప‌క్క‌ల‌వారి జ‌ర్నీ కూడా చూపించాలి. 
మ‌హేష్‌బాబు చూధారా?
ట్రైల‌ర్ ముందు రోజు సినిమా చూశారు. 5 నిముషాలు ఏమీ మాట్లాడ‌లేదు. బాగుందో లేదో అనే అనుమానం వ‌చ్చింది. కానీ వెంట‌నే శేష్‌ను హ‌గ్ చేసుకున్నారు. అభినందించారు. 
 
మిగ‌తా న‌టీన‌టులు గురించి?
రేవ‌తి నా ఫేవ‌రేట్‌ న‌టి. మోనిట‌ర్‌లో చూస్తేనే ఏడుపువ‌చ్చింది. అలా పాత్ర‌ను పండించారు. ప్ర‌కాష్‌రాజ్ నాతో రెండో సినిమా. ఇలాంటి సినిమాకు కొన్ని ప‌రిమితులుంటాయి. అలానే చేశారు. అలాగే సాయిమంజ్రేక‌ర్‌, శోభితా బాగా న‌టించారు.  
 
మీ త‌దుప‌రి చిత్రాలు?
రెండు క‌థ‌లున్నాయి. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో చేయాలి. త్వ‌ర‌లో వివ‌రాలు చెబుతాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుబాయ్ బిజినెస్‌మేన్‌ను పెళ్లాడనున్న నటి పూర్ణ