Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతి తక్కువ టికెట్ ధరలతో అడివి శేష్ మేజర్ చిత్రం

Advertiesment
Adivi Shesh
, శుక్రవారం, 27 మే 2022 (20:11 IST)
Adivi Shesh
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం 'మేజర్'. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. తాజాగాఈ చిత్ర సింగిల్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని మేజర్ చిత్ర నిర్మాతలు ప్రకటించారు.
 
తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లలో టికెట్ ధర 150 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 147, మల్టీప్లెక్స్‌లలో 195, 177 ధరలు ఉంటాయని తెలిపారు. పాండమిక్ తర్వాత అతి తక్కువ టికెట్ ధరలతో రాబోతున్న చిత్రం మేజర్ కావడం విశేషం.  
 
చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో టికెట్ ధరలను అందరికీ అందుబాటులో తెచ్చారు నిర్మాతలు. ఈ నిర్ణయం తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించడంతో పాటు అన్ని వర్గాలకి ధరలు అందుబాటులో వుండటం వలన తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ వుంటారు.
 
కాగా థియేట్రికల్ రిలీజ్ కి ముందే దేశవ్యాప్తంగా ప్రీమియర్‌లను నిర్వహిస్తూ మేజర్ యూనిట్ మరో ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం పూణేలో ఫస్ట్ స్క్రీనింగ్ నిర్వహించగా యూనానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ షో చూసిన ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్‌ ఇచ్చారు.
 
ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.
 
26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
 
ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో మేజర్ చిత్రం ముందువరుసలో వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రల్ పైప్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్‌