Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహేంద్ర సింగ్ ధోనీపై కేసు.. ఎందుకో తెలుసా?

Advertiesment
Dhoni
, బుధవారం, 1 జూన్ 2022 (10:29 IST)
భారత మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీపై బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రూ.30 లక్షల చెక్కు బౌన్స్ కేసులో ఈ కేసు నమోదైంది. 
 
ఈ కేసులో ధోనీతో పాటు మరో ఏడుగురు నిందితులుగా ఉన్నారు. కాగా, ఈ కేసు మోసానికి సంబంధించినదని తెలుస్తోంది. ధోనీతో పాటు మరో ఏడుగురు ఎరువుల విక్రేతలపై ఈ కేసు పెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. నిజానికి ఇది రెండు కంపెనీల మధ్య వివాదం. ఉత్పత్తిని విక్రయించే క్రమంలో కంపెనీ తమకు సహకరించలేదని, దీని వల్ల భారీ మొత్తంలో ఎరువులు అమ్ముడు కావట్లేదని ఆరోపించారు. దీని తరువాత, ఏజెన్సీ యజమాని నీరజ్, కంపెనీ సహకరించడం లేదని ఆరోపించాడు. దీని వల్ల తనకు నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చాడు.
 
ఆ తర్వాత కంపెనీ మిగిలిన ఎరువులను వెనక్కి తీసుకుంది. ప్రతిఫలంగా, రూ. 30 లక్షల చెక్కును కూడా వారి ఏజెన్సీ పేరు మీద ఇచ్చారు. కానీ అది బౌన్స్ అయింది. దాని సమాచారాన్ని లీగల్ నోటీసు ద్వారా కంపెనీకి అందించారు. ఇప్పటి వరకు అది పరిష్కరించలేదు. 
 
అలాగే కంపెనీ కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. దీని తర్వాత కంపెనీ సీఈవో రాజేష్ ఆర్యతో పాటు కంపెనీకి చెందిన మరో ఏడుగురు ఆఫీస్ బేరర్లపై కేసు నమోదైంది. కాగా, ఈ ప్రొడక్ట్‌కు మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. కాబట్టి అతని పేరు కూడా ఫిర్యాదులో నమోదు చేశారు.
 
మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఎరువుల కోసం ప్రచారం చేశాడు. అలాంటి సందర్భంలో, నీరజ్ కుమార్ నిరాలా ధోనిపై కేసు పెట్టారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన కోర్టు దీనిపై తదుపరి విచారణ జూన్ 28న జరగనుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను అబ్బాయినైతే బాగుండేది, ఆ నొప్పి వుండేది కాదు కదా: చైనీస్ క్రీడాకారిణి కిన్వెన్