Webdunia - Bharat's app for daily news and videos

Install App

'హరిహర వీరమల్లు'లో అకీరా నందన్?

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (23:20 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా గడుపుతున్నారు. ఆయన పార్టీ బలోపేతం అయితే… ఆయనకి బాధ్యతలు మరింత పెరుగుతాయి. దీంతో సినిమాలను కాస్త బ్రేక్ ఇచ్చి.. రాజకీయాలను ఓ లుక్కేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్‌ను హీరోగా ఎప్పుడు లాంచ్ చేస్తారా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 
 
అకీరా ఎక్కడ కనిపించినా అభిమానులు మురిసిపోతున్నారు. 6 అడుగులు పైనే హైట్ ఉన్న అఖీరా గ్లామర్ విషయంలో కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోడు. అయితే అకీరా సినీ రంగ ప్రవేశం గురించి తల్లి రేణు దేశాయ్ ఎప్పుడూ నోరు మెదపలేదు. పవన్ కూడా ముసిముసి నవ్వులు నవ్వేస్తూ దాటేశాడు కానీ అభిమానులకి కావాల్సిన ఆన్సర్ మాత్రం ఇవ్వలేదు. అయితే ఓ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఫిలింనగర్‌ను కూడా ఓ ఊపు ఊపేస్తోంది.
 
అదేంటి అంటే.. క్రిష్ తెరకెక్కిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో అకీరా నటిస్తున్నాడట. అందుకోసమే అతను కర్ర సాము కూడా నేర్చుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. అంతేకాదు సంగీతం టీచర్‌ను కూడా పెట్టుకుని అతను సాధన చేస్తుండడాన్ని బట్టి చూస్తే ఈ వార్త నిజమే అనిపిస్తుంది. అయితే అధికారిక ప్రకటన వస్తే కానీ కచ్చితంగా చెప్పలేము.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments