Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్‌ను ఇరుకును పెడుతున్న ప్రకాష్ రాజ్..?

పవన్ కళ్యాణ్‌ను ఇరుకును పెడుతున్న ప్రకాష్ రాజ్..?
, గురువారం, 21 అక్టోబరు 2021 (23:13 IST)
ప్రకాష్ రాజ్. మా ఎన్నికల వ్యవహారం కాస్త పెద్ద రచ్చకు, చర్చకు కారణమైంది. ఇది అందరికీ తెలిసిందే. తెలుగు సినీపరిశ్రమలోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్లలో చర్చకు కారణమైంది. సినీపరిశ్రమ కాస్త రెండుగా చీలిపోవడానికి కారణమైంది. ఎవరికి వారుగా విడిపోయి ఇప్పటికీ విమర్సలు చేసుకోవడం వేదికైంది.
 
అయితే ఎన్నికలు ముగిసి మంచు విష్ణు ప్యానల్ గెలిచిన తరువాత కూడా మాటల యుద్ధం మాత్రం ఆగలేదు. అది అలాగే కొనసాగుతోంది. అయితే పొలిటికల్‌గా దూరంగా ఉంటూ ఏకంగా ప్రధానినే విమర్సించారు. ప్రకాష్ రాజ్ విమర్సలు కాస్త బిజెపి నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. 
 
అది అప్పట్లో ముగిసిపోయింది. కానీ తాజాగా మాఅసోసియేషన్ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దక్కడంతో ఎలాగోలా ఎన్నికల్లో పోటీకి దిగాడు ప్రకాష్ రాజ్. కానీ ఓటమి పాలయ్యాడు. ప్రకాష్ రాజ్ ఒక్కరే కాదు నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. 
 
అయితే ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నారట ప్రకాష్ రాజ్. అది కూడా జనసేనలోకి వెళితే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారట. కానీ ఇక్కడే అసలైన చిక్కుంది. పవన్ కళ్యాణ్‌తో గతంలో ప్రకాష్ రాజ్‌కు విభేధాలు ఉన్నాయి. అంతేకాదు జనసేన బిజెపితో పొత్తు కూడా ఉంది.
 
ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ వస్తానన్నా పవన్ కళ్యాణ్ తీసుకుంటారా లేదా అన్నది అనుమానమే. ఏకంగా ప్రధానమంత్రినే విమర్సించిన ప్రకాష్ రాజ్‌ను జనసేనలో చేర్చుకుంటే బిజెపి నేతలు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఒకవేళ బిజెపి ముఖ్య నేతలను ఒప్పించుదామని ప్రయత్నం చేసినా వారు ఒప్పుకోవడం సాద్యం కాని విషయమే. 
 
ఏ రకంగా చూసినా ఇదంతా పవన్ కళ్యాణ్‌‌ను ఇరుకున పెట్టే విషయంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. నాగబాబు రెకమెండేషన్ తోనే జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారట ప్రకాష్ రాజ్. మరి చూడాలి. ఇదంతా జరుగుతుందా.. లేకుంటే మధ్యలోనే ఆగిపోతుందో..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత పిటిషన్‌పై కూకట్ పల్లి కోర్టు షాక్.. ఫోటోలు పెట్టేది వాళ్లే.. మరి పరువు..?