Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ ఐదో సీజన్.. ఆమె పారితోషికంపై చర్చ.. ప్రియాంక జోస్యం

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (22:43 IST)
Priya
బిగ్ బాస్ ఐదో సీజన్ నుంచి ప్రియా బయటికి వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఎందుకంటే మొదట్లో ప్రియాపై నెగిటివిటీ లేదు. ఓసారి రవి కామెంట్స్‌కు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కానీ… అందులో ఆమె తప్పు లేదని బిగ్ బాస్ పరోక్షంగా తేల్చేసాడు. ఇది పక్కన పెట్టినా ఆమెకు ఓట్లు బాగానే పడ్డాయి.
 
కానీ ఆమె ఎలిమినేట్ అయ్యే ముందు సన్నీతో వాగ్వివాదానికి దిగడం అతన్ని కొడతాను అని వార్నింగ్ ఇవ్వడం వంటివి ఆమె ఎలిమినేషన్‌కు కారణమయ్యాయని అంతా భావిస్తున్నారు. అయితే 7 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ప్రియకు.. బిగ్ బాస్ ఎంత పారితోషికం ఇచ్చి ఉంటాడు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. సోషల్ మీడియాలో ఈ విషయం పై డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. 
 
వారానికి రూ.1.5 లక్షలు చొప్పున… 7 వారాలకు గాను రూ.10 లక్షల వరకు పారితోషికం అందుకుందట ప్రియా. ఈ లెక్క ఇంకా ఎక్కువే అవ్వొచ్చు కానీ తక్కువ కాదు అని సమాచారం. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లలో ఎక్కువ పారితోషికం అందుకున్నది ప్రియా అనే చెప్పాలి.
Priya
 
మరోవైపు నామినేషన్‌ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్స్‌ అంతా ఎప్పటిమాదిరే కలిసిపోయారు. హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. ఇక బిగ్ బాస్-5లో తాను మానస్‌ టాప్‌-5లో ఉంటామని ప్రియాంక జోస్యం చెప్పింది. దానికి సిరి నవ్వుతూ.. 'మేమేంటి అడుక్కోవాలా..?' అని ప్రశ్నించింది. ఇక మానస్‌ అయితే.. అంకుల్స్‌ అంతా బయటకు వెళ్లిపోవాలి.. కుర్రాళ్లంతా లోపలే ఉండాలని కోరుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

UP Horror: 52 ఏళ్ల వ్యక్తిని చంపేసిన బావమరిది, అత్త హత్య చేశారు..

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments