Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ తదుపరి చిత్రం ఎవరితో తెలుసా?

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (16:43 IST)
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న నట వారసులలో హిట్ కోసం తెగ ట్రై చేస్తున్న వారిలో అక్కినేని అఖిల్ ముందున్నాడు. ఇప్పటి వరకూ తాను నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లను రాబట్టలేదు. తాజాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్‌ను నిరాశ పరిచింది. కాగా ఈ సినిమా తర్వాత అఖిల్ హీరోగా నటించబోయే కొత్త సినిమా ప్రారంభమైంది. 
 
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై, ప్రొడక్షన్ నెం:5గా రూపొందనున్న ఈ సినిమాని బన్నీవాసు, దర్శకుడు వాసువర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఫిల్మ్‌నగర్‌లో జరిగాయి.
 
అక్కినేని నాగార్జున, అమల దంపతులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ తదితరులు హాజరయ్యారు. ఈ మూవీ కోసం అఖిల్ జుట్టు, గెడ్డం పెంచి సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. 
 
ప్రస్తుతం హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి సంచలన సంగీత దర్శకుడు గోపి సుందర్ బాణీలను సమకూర్చనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments