అఖండ టైటిల్ సాంగ్ వచ్చేసింది

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (15:35 IST)
Akhanda- balakrishna
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం అఖండ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరో వైపు ప్రమోషన్స్ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.
 
దీపావళి సందర్బంగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియోకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక జోష్‌ను పెంచేందుకు చిత్రయూనిట్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. తమన్ సంగీత సారధ్యంలో శంకర్ మహదేవన్, అతని కుమారులు కలిసి పాడిన ఈ పాట ఈ ఏడాది మాస్ ఆంథమ్‌గా నిలిచేలా ఉంది. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య కనిపించడం ప్రత్యేకమైన విషయం. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ అద్బుతమైన సాహిత్యాన్ని అందించారు.
 
మొదటగా మెలోడీ ట్రాక్ అడిగా అనే పాటను విడుదల చేశారు. మ్యూజిక్ లవర్స్‌ను ఆ పాట తెగ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టైటిల్ ట్రాక్ క్షణాల్లో వైరల్ అయింది.
 
బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతోన్న మూడో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలున్నాయి.
 
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments