నట సింహం నందమూరి బాలకృష్ణకు చిన్న ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలం ఆయన కుడి భుజం నొప్పితో బాధ పడుతున్నట్లు సమాచారం. అందునిమిత్తం సోమవారంనాడు కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. డాక్టర్ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆపరేషన్ జరిగినట్లు తెలిసింది. ఒక్క రోజు అనంతరం మంగళవారంనాడు ఆయన డిశ్చార్జ్ చేస్గున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేస్తున్నారు. దాదాపు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
దీనికి కారణం లేకపోలేదు. ఇటీవలే `ఆహా` ఓటీటీ కోసం బాలకృష్ణ ఓ షూట్‌లో పాల్గొన్నారు. అయితే అందులో గుర్రంపై స్వారీ చేయాల్సి వుంది. ఆ షాట్ తీస్తున్నట్లు అనుకోకుండా గుర్రంపైనుంచి పడిపోయారని తెలిసింది. ఆ వెంటనే సర్దుకుని కొద్ది సేపటికి ఆయన షూట్‌లో పాల్గొన్నట్లు సిబ్బంది తెలియజేశారు. ఆ తర్వాత జరిగిన షూట్‌లో తను అనుకున్న భాగాన్ని పూర్తిచేశారు. ఆ తర్వాత భుజం నొప్పి తీవ్రంగా కావడంతో ఇలా శస్త్రచికిత్స చేసినట్లు చెబుతున్నారు.