అల్లు అరవింద్ గారి మానసిక పుత్రిక ఆహా! ఓటీటీ మాద్యమం. దానిలో ప్రసారం కాబోయే `అన్ స్టాపబుల్` కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ యాంకర్‌గా కనిపించబోతున్నారు. కొద్ది సేపటికి క్రితమే హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలకృష్ణ సరదా మాటలతో హుసారెత్తించారు.
ఎన్నో ఏళ్ళుగా జానపదాలు, సాంఘికం, యాక్షన్, కుటుంబ కథా చిత్రాలు చేశాను. ప్రజల అభిమానం పొందాను. అంతులేని ప్రేమాభిమానాలు ఇచ్చారు. ఇంకా ఏదో చేయాలనే ప్రేరణతో ఆహా ఓటీటీ మాద్యంలో యాంకర్‌గా కనిపించబోతున్నాను. అల్లు అరవింద్‌గారు తెలుగువారి సత్తా చాటి ఆహా! అనిపిస్తున్నారు. పొట్టివారికి పుట్టెడు బుద్ధులు. చనువుతో మాట్లాడుతున్నాను. వారి కుటుంబానికి మా కుటుంబానికి చాలా సన్నిహితం. లెజెండ్ అల్లు రామలింగయ్యగారి అబ్బాయి అరవింద్. చిన్నప్పుడు మా ఇంటిలో వంటగదిలో నేరుగా వెళ్ళి మా అమ్మగారితో టీ పెట్టించుకునేవారు ఆయన. ఎన్.టి.వోడు అనేవారు నాన్నను. బండోడికి ఏమన్నా ఉన్నాయా ? మోయడానికి ? అనే వారు. అలాంటి చనువు ఇండస్ట్రీలో ఒక్క అల్లు రామలింగయ్య గారికి మాత్రమే ఉంది” అంటూ వ్యాఖ్యానించారు బాలయ్య.
ఇంకా ఆయన మాట్లాడుతూ, నటన అనేది కేవలం నవ్వడం, కేకలు వేయడమేకాదు. పాత్ర ఆత్మలోకి వెళ్లడమే. మూలాల్లోకి వెళ్ళాలి. అలా నేను చేసే అన్ని పాత్రలు అలాంటివే. ఈరోజు `అన్ స్టాపబుల్` కరెక్టన్ రైజర్ జరిగింది. మనిషి జీవితంలో ఏవోవో ఆలోచనలతో జీవనం ప్రారంభిస్తారు. ఉలితో రాయి రూపాన్ని తీసుకుంటుంది. అలా మనిషి ఆటుపోటులను ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది. అందుకే ఆహా!లో యాంకర్‌గా వున్నాను. నా జీవితం తెరిచిన పుస్తకం. అలాగే ప్రతి నటుడు మనిషి జీవితంలో ఎన్నో వుంటాయి. అవన్నీ బయటకు చెప్పుకున్నప్పుడు ప్రశాంతంగా వుంటుంది. ఇది కూడా కళాసేవ లాంటిదే. అని త్వరలో కలుద్దాం అని తెలిపారు.