Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లేడి ఓరియెంటెడ్ కథాంశంతో మై నేమ్ ఈజ్ శృతి

లేడి ఓరియెంటెడ్ కథాంశంతో  మై నేమ్ ఈజ్ శృతి
, గురువారం, 14 అక్టోబరు 2021 (18:19 IST)
My name is Shruti
ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ వుంటుందని చెబుతుంటారు. అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక మగాడు వుంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొన్నదన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రమే మై నేమ్ ఈజ్ శృతి అంటున్నారు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్.  ఈ చిత్రంలో  ప్రముఖ కథానాయిక హాన్సిక టైటిల్ పాత్రను పోషిస్తుంది. 
 
లేడి ఓరియెంటెడ్ కథాంశంతో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 85శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా వుండే కథాంశంతో, సర్‌ప్రైజింగ్‌గా వుంటే ట్విస్ట్‌లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాన్సిక పాత్ర ఎంతో వైవిధ్యంగా వుంటుంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతి పాత్రలో హన్సిక కనిపిస్తుంది. 
 
సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది  అన్నారు. నిర్మాత మాట్లాడుతూ  ఇప్పటి వరకు హైదరాబాద్, వైజాగ్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. బ్యాలెన్స్ పార్ట్‌ను త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. నిర్మాతలుగా ఓ మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా వుంది. దర్శకుడు ఎంతో క్లారిటీతో, పూర్తి ప్రణాళికతో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. అతనికి కమర్షియల్ దర్శకుడిగా మంచి భవిష్యత్ వుంది అన్నారు. 
 
మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్ రాబీన్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, స్టంట్స్: రాబిన్ సుబ్బు, సాహిత్యం: కృష్ణకాంత్, ఆర్ట్: గోవింద్ ఎరసాని, లైన్‌ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ కర్రెం, కో-ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ బండి, నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంతోష్ శోభన్, మెహ్రీన్ కెమిస్ట్రీ బాగుందంటున్న యూనిట్‌