Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంతోష్ శోభన్, మెహ్రీన్ కెమిస్ట్రీ బాగుందంటున్న యూనిట్‌

సంతోష్ శోభన్, మెహ్రీన్ కెమిస్ట్రీ బాగుందంటున్న యూనిట్‌
, గురువారం, 14 అక్టోబరు 2021 (18:07 IST)
Santosh Shobhan, Mehreen
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా, ఎక్కేసిందే పాటలకు  అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఆద్యంతం వినోదాల విందుగా ఈ ట్రైలర్ సాగింది. 
 
ముఖ్యంగా డైలాగులు చాలా బాన్నాయి. ‘యువీ వాళ్లు రాధే శ్యామ్ తీసారని ఊరికే ఉన్నారా.. ఏక్ మినీ కథ తీయలేదు.. కంటెంట్ ఎక్కుడుంటే అక్కడికి వెళ్లిపోవడమే’ అంటూ సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంది. అలాగే అజయ్ ఘోష్ కామెడీ ట్రైలర్‌లో ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. 
 
మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడతనమా చూడతరమా ఫస్ట్ లుక్ ఆవిష్క‌రించిన సాగర్ చంద్ర