Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

దేవీ
శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (18:23 IST)
Balayya- srinu
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
 
ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరగనుంది. ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను అక్కడ అద్భుతమైన ప్రదేశాల కోసం రెక్కీ చేస్తున్నారు, బాలకృష్ణ, ఇతర ప్రముఖ తారాగణం సభ్యులు పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. జార్జియా సీనరిక్ బ్యూటీ నేపథ్యంలో ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా ఉంటాయి. జార్జియాలో జరుగుతున్న రెక్కీల మధ్య బోయపాటి శ్రీను తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇది సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం.
 
హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. సంగీత సంచలనం ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ వంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు.
 
అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి రానుంది.
 
నటీనటులు: గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
బ్యానర్: 14 రీల్స్ ప్లస్
సమర్పణ: ఎం తేజస్విని నందమూరి
సంగీతం: థమన్ ఎస్
డీవోపీ: C రాంప్రసాద్, సంతోష్ D Detakae

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments