Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖండ డైలాగ్ లీక్... ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు.. రైట్ లేదు, లెఫ్ట్ లేదు..

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (21:35 IST)
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య మరోసారి నటిస్తుండటంతో అఖండ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, లిరికల్ సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
 
ఇక ఈ సినిమా ట్రైలర్‌ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రేపు సోషల్ మీడియాలో బాలయ్య దెబ్బ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆలోచిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ఓ లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలోని ఓ డైలాగ్ సోషల్ మీడియాలో లీకయ్యింది. 
 
ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. బాలయ్య చెప్పే ఈ పవర్‌ఫుల్ డైలాగ్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇంతకీ ఆ డైలాగ్ ఏమిటని మీరు అనుకుంటున్నారా?
 
''ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు.. రైట్ లేదు, లెఫ్ట్ లేదు.. అటు వైపు నేనే.. ఇటు వైపు నేనే..'' అంటూ సాగే ఈ డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా అంటున్నారు. ఇక ఈ డైలాగ్‌ను బాలయ్య నోటితో వింటే ఆ కిక్కే వేరు అంటున్నారు నందమూరి అభిమానులు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియాంకా గాంధీ భర్తకు ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధించాలి : ఈడీ

ఎయిర్‌పోర్టులకు ధీటుగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి : డాక్టర్ పెమ్మసాని

భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకిన భార్య

బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్‌కు ఓటు వేద్దామా? పులివెందులలో టీడీపీ వినూత్న ప్రచారం

మేమే బాస్‌ అనుకునేవారికి భారత్ వృద్ధి నచ్చలేదు : రాజ్‌నాథ్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments