Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో సందడి.. పొరుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి కలెక్షన్ల సునామీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "అజ్ఞాతవాసి". బుధవారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తోంది. ముఖ్యంగా పవన్ అభిమానులకు ముందుగానే సంక్రాంతి వచ్చినట్టుంగా ఉంది. ఇక కలెక్షన్ల సంగతి చె

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (09:32 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "అజ్ఞాతవాసి". బుధవారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తోంది. ముఖ్యంగా పవన్ అభిమానులకు ముందుగానే సంక్రాంతి వచ్చినట్టుంగా ఉంది. ఇక కలెక్షన్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టస్తోంది. 
 
ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన విషయంతెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఓవర్సీస్‌లోనే ప్రీమియర్స్ రూపంలో 1.5 మిలియన్ డాలర్లను రాబట్టింది. దీంతో 'బాహుబలి 1', ఖైదీ నంబర్ 150 రికార్డును అజ్ఞాతవాసి చెరిపేశాడు.
 
ఇక చెన్నై‌లోను ఈ సినిమా తన హవా చూపిస్తోంది. బుధవారం ఒక్క రోజులోనే ఈ సినిమా 24 లక్షల గ్రాస్‌ను సాధించినట్టుగా ట్రేడ్ వర్గాల సమాచారం. ఇవి రికార్డు స్థాయి వసూళ్లని అంటున్నారు. అలాగే, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సంక్రాంతి సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. చెన్నైలోనూ ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments