Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి-ఆర్జీవీ తీరుపై హైపర్ ఆది: ఇదిగో తెల్ల కాకి అంటే.. అదిగో పిల్ల కాకి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాతవాసి'' సినిమాపై వివాదాస్పద రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాను చూసి జడుసుకున్నట్లు వర్మ కామెంట్స్ చేశాడు. పవన్ కెరీర్‌లోనే అత్యంత

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (09:14 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాతవాసి'' సినిమాపై వివాదాస్పద రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమాను చూసి జడుసుకున్నట్లు వర్మ కామెంట్స్ చేశాడు. పవన్ కెరీర్‌లోనే అత్యంత చెత్త సినిమా అయిన "పులి"ని చూసినట్టు ఉందని పేర్కొన్నాడు. కోరలు, పంజా లేని ఇలాంటి పులిని ఇప్పటివరకు చూడలేదని వ్యంగ్యంగా తెలిపాడు. చారలు లేని పులిని  తాను ఇప్పటి వరకు చూడలేదన్న వర్మ, దుమకాల్సిన పులి పాకడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్వీట్ చేశాడు. 
 
అజ్ఞాతవాసి అతిపెద్ద డిజాస్టర్ అని ఆర్జీవి అన్నాడు. అంతటితో ఆగకుండా అజ్ఞాతవాసి సినిమాపై రివ్యూలు ఇచ్చిన సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌పై ప్రశంసలు కురిపించాడు. ''అజ్ఞాతవాసి"కి కత్తి ఇచ్చిన రివ్యూ వీడియోను తాను ఇప్పుడే చూశానని పేర్కొన్న వర్మ.. పవన్ కంటే కత్తి మహేశ్ చాలా అందంగా ఉన్నాడని సెటైర్లు విసిరాడు. రామ్ గోపాల్ వర్మ తనను పొగడటంతో కత్తి థ్యాంక్యు అంటూ సమాధానమిచ్చాడు. 
 
కానీ జబర్దస్త్ ఫేం హైపర్ ఆది మాత్రం వెరైటీగా స్పందించాడు. వీరిద్దరి తీరు చూస్తుంటే "ఇదిగో తెల్ల కాకి అంటే.. అదిగో పిల్ల కాకి" అన్నట్టు ఉందని ఎద్దేవా చేశాడు. కత్తి మహేశ్ పేరు వింటేనే రగిలిపోతున్న పవన్ అభిమానులు ఆర్జీవీ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments