Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గురువారం దినఫలాలు... నిరంతర కృషితోనే విజయం...

మేషం: ఏకాంతం కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటం వలన అశాంతికి లోనవుతారు. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడవలసి వస్తుంది. రాజకీయాల

గురువారం దినఫలాలు... నిరంతర కృషితోనే విజయం...
, గురువారం, 11 జనవరి 2018 (08:21 IST)
మేషం: ఏకాంతం కోసం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ శ్రీమతితో అనునయంగా మెలగండి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయటం వలన అశాంతికి లోనవుతారు. ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడవలసి వస్తుంది. రాజకీయాల్లో వారికి అలజడి అధికమవుతుందని గమనించండి.
 
వృషభం: మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా తట్టుకుంటారు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎల్ఐసీ, పోస్టల్, ఇతర ఏజెంట్లకు ఆశాజనకం. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయమని గమనించండి. మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యంలో సంతృప్తికానరాదు. 
 
మిథునం: విద్యార్థులకు ఇతరుల విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులు తప్పవు. వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక కార్యానికి వినియోగించవలసి వస్తుంది. 
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. డాక్టర్లు శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఫీజుల చెల్లింపుల విషయంలో సమస్యలు తలెత్తుతాయి.
 
సింహం: కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులు తప్పవు. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. గృహంలో ప్రశాంతత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు.
 
కన్య : బ్యాంకింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
 
తుల: ఆర్థికాభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్సాహవంతంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు. షాపు గుమాస్తాలు, అకౌంట్లకు ఒత్తిడి, పనిభారం అధికం. ఉద్యోగస్తులు, అధికారులు కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్తగా మెలగాలి.
 
వృశ్చికం: పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ యత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో వారు విరోధులు వేసే పథకాలను తెలివితో ఎదుర్కొంటారు. కొంత మొత్తమైనా పొదుపు చేయాలన్నే మీ కోరిక ఫలిస్తుంది. ముఖ్యమైన ఫైళ్ల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి.
 
ధనస్సు: ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర పనులపై ప్రభావం చూపుతుంది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. చిన్ననాటి మిత్రులతో గత అనుభవాలు ముచ్చటిస్తారు.
 
మకరం: ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఇంట హడావుడి తగ్గడంతో మీలో నిస్తేజం  చోటుచేసుకుంటుంది. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులకు వెరవక ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. పుణ్యకార్యాలలో ప్రముఖంగా వ్యవహరించి ప్రశంసలు పొందుతారు.
 
కుంభం: విధి నిర్వహణలో తప్పిదాలు దొర్లే అవకాశం ఉంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో మనస్పర్థలు తలెత్తినా తేలికగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. మీ గౌరవ, అభిమానాలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. 
 
మీనం: స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఓ చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాము, ముంగిస, నెమలి అక్కడ ఆడుకుంటూ కనిపించాయి...