Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

06-01-18 శనివారం : గృహం కొనుగోలుకు యత్నిస్తారు

మేషం : వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. వైద్యులకు ఆపరేషన్‌లు చేయునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. ఉపాధ్యాయులు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫీజులు, బిల్లులు చెల్లిస్తార

Advertiesment
06-01-18 శనివారం : గృహం కొనుగోలుకు యత్నిస్తారు
, శనివారం, 6 జనవరి 2018 (08:25 IST)
మేషం : వ్యాపారవర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. వైద్యులకు ఆపరేషన్‌లు చేయునపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. ఉపాధ్యాయులు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. కొబ్బరి, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
వృషభం : ఒకానొక సందర్భంలో మిత్రులతీరు నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. మీ క్రింద పనిచేయు వారితో దురుసుగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. 
 
మిథునం : ఆర్థిక విషయాలలో మీ లెక్కలు తారుమారు కాగలవు. స్త్రీలు పోటీలలో పాల్గొంటారు. చేతి వృత్తులయందు తరచూ ఆటంకాలు ఏర్పడతాయి. జాగ్రత్త వహించండి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఖర్చులు సామాన్యం. 
 
కర్కాటకం : వృత్తి ఉద్యోగాలలో వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కోర్టు విషయాలలో సంతృప్తి కానవస్తుంది. పెద్దలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. సోదరీ, సోదరులతో మెలకు వహిస్తారు. గృహంలో కొనుగోలు చేయుప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. 
 
సింహం : ఉపాధ్యాయులు అపనిందలు, విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్లీడర్లకు తమ క్లయింట్‌లు తీరు ఇబ్బందులు గురిచేస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. హామీలు, మధ్యవర్తిత్వ విషయంలో పునరాలోచన మంచిది. 
 
కన్య : బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రయాణాల్లో ఊహించని చికాకు లెదురవుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావటంతో పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, ఏకాగ్రతం లోపం వంటి తలెత్తుతాయి. పత్రికా, వార్తా సిబ్బందికి ఏకాగ్రత లోపం చికాకులు అధికం. 
 
తుల : ఉద్యోగస్తులకు హోదాతో పాటు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. రుణ విముక్తులు కావడంతో పాటు కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు. స్త్రీలకు ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల గడువు పెంపులో పునరాలోచన మంచిది. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. 
 
వృశ్చికం : రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. దైవదర్శనాలు మొక్కుబడులు అతికష్టంమ్మీద అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. రావలసిన ధనంలో కొంత మొత్తం అందుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు : స్థిరాస్తి కొనుగోలు ప్రయ్నాలు కలిసివస్తాయి. టీవీ కార్యక్రమాలు, కాళాత్మక పోటీల్లో స్త్రీలు జయం సాధిస్తారు. నూతన వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలం. క్రయ విక్రయాల్లో లాభసాటిగా సాగుతాయి. మీ ప్రసంగం అతిథులను, శ్రోతలను ఆకట్టుకుంటుంది. కొన్ని సంఘటనలు మరిచిపోవాలనుకున్నా సాధ్యంకాదు. 
 
మకరం : వాహనం, విలువైన సామాగ్రి మరమ్మతులకు గురయ్యే ఆస్కారం ఉంది. ప్రముఖులు, ఆత్మీయులను కలుసుకుంటారు. ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఆప్తులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
కుంభం : అర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల, వస్తువుల పట్ల మెళకువ అవసరం. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి ఊహించని చికాకులెదుర్కోవలసి వస్తుంది. కొబ్బరి, పండ్లు పూల వ్యాపారులకు లాభదాయకం. మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. 
 
మీనం : మీ జీవితం భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు సంతానంతో చికాకులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల ఆశీస్సులు, ప్రముఖులు పొందుతారు. బంధు మిత్రులతో కలుసుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ చెట్టును నరకాలని చూసిన వారిని చంపేస్తోంది... ఎక్కడ?