Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ చెట్టును నరకాలని చూసిన వారిని చంపేస్తోంది... ఎక్కడ?

మన భారతదేశంలో ఎన్నో విశ్వాసాలు ప్రచారంలో వున్నాయి. కొన్నింటిని గట్టిగా నమ్ముతారు. వాటిని పాటిస్తారు చాలామంది. ఇలాంటి నమ్మకాలు, విశ్వాసాలు జపాన్ ప్రజలకు కూడా ఎక్కువట. ఈ దేశంలో కూడా దేవాలయాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక విషయానికి వస్తే... సాధారణంగా ఏవైనా ని

Advertiesment
believe it or not
, శుక్రవారం, 5 జనవరి 2018 (17:11 IST)
మన భారతదేశంలో ఎన్నో విశ్వాసాలు ప్రచారంలో వున్నాయి. కొన్నింటిని గట్టిగా నమ్ముతారు. వాటిని పాటిస్తారు చాలామంది. ఇలాంటి నమ్మకాలు, విశ్వాసాలు జపాన్ ప్రజలకు కూడా ఎక్కువట. ఈ దేశంలో కూడా దేవాలయాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక విషయానికి వస్తే... సాధారణంగా ఏవైనా నిర్మాణాలను చేపట్టేటప్పుడు అక్కడ ఏవైనా చెట్లు అడ్డుగా ఉంటే వాటిని కొట్టేసి పని పూర్తి చేస్తుంటాము. అలాగే జపాన్‌లో చేపట్టిన నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఒక చెట్టును కొట్టేయడానికి జపనీయులు వణికిపోతున్నారు.
 
జపాన్‌లోని ఒకాసా ప్రాంతంలో ఉన్న కమాషియా రైల్వే స్టేషన్‌లో ఒక పొడవైన కర్పూరం చెట్టు ఉంది. ఈ చెట్టు వయస్సు సుమారు 700 ఏళ్లు ఉండవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ స్టేషన్ 1910లో ప్రారంభమైంది. అప్పుడు ప్రయాణీకులు ఈ చెట్టు నీడన సేద తీరేవారట. తర్వాత కాలంలో ఈ స్టేషన్‌ను విస్తరించే పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న ఈ చెట్టును కొట్టేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. 
 
కానీ ఆ చెట్టును నరకడానికి వెళ్లిన కూలీలు వేర్వేరు కారణాలతో అందరూ మరణించారు. ఇలా జరగడానికి కారణం ఆ చెట్టేనని స్థానికుల మదిలో ఒక ముద్ర పడిపోయింది. అప్పటి నుండి ఆ చెట్టును నరికే సాహసం ఎవరూ చేయలేదు. కొంతమంది అధికారులు వచ్చినప్పటికీ స్థానికులు వ్యతిరేకించారు. దీంతో చేసేదేమీ లేక ఆ చెట్టుకు కాస్త స్థలం వదిలేసి నిర్మించారు. ఆ చెట్టు దైవత్వం కలిగిన చెట్టుగా ముద్రపడిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకన్న ఆదాయం ఎంతో తెలుసా?