07-01-18 ఆదివారం రాశిఫలాలు : ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయ్
శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి. దుబారా ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెలకువ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యక
మేషం: కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. ఖర్చులు అదుపు చేయలేరు. మరింత ధన వ్యయం అవుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు.
వృషభం: ప్రైవేట్ సంస్థల్లోని వారు మరో ఉద్యోగంలో చేరే విషయంలో పునరాలోచన మంచిది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ముఖ్యమైన వ్యవహారాలను గోప్యంగా ఉంచండి.
మిథునం: ఉద్యోగస్తులకు పండుగ అడ్వాన్స్‌లు మంజూరు కాగలవు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
కర్కాటకం: సంతానం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. బెట్టింగ్‌లు, జూదాలు, వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
సింహం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. అనుకోని చెల్లింపుల వల్ల ఆటుపోట్లు తప్పవు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి .
కన్య: శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. ప్రేమికుల మధ్య అనుమానాలు తొలగిపోతాయి. దుబారా ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాల్లో మెలకువ అవసరం. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది.
తుల : ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఇతరులతో కలసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కోళ్ల, మత్స్య, పాడి రంగాల వారికి పురోభివృద్ధి. కానివేళలో బంధువులరాక ఇబ్బంది కలిగిస్తుంది.
వృశ్చికం: బెట్టింగ్‌లు, జూదాలు, వ్యసనాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మిత్రులతో సఖ్యత కోసం ప్రయత్నిస్తారు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలను తెచ్చుకోకండి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.
ధనుస్సు : ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. రాజకీయాల్లోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు నిరంత కృషి అవసరమని గమనించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
మకరం : ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఇతరుల తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. వ్యాపారాల్లో మంచి మాటలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు.
కుంభం : నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో విజయం సాధిస్తారు. పెద్దల సలహాను పాటించి నీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ కష్టం వృధాపోదు. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి.
మీనం : ఉద్యోగస్తులు విశ్రాంతి చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ మాటకు సర్వత్రా మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి.