Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి క్షణంలో ఆస్కార్ రేసులో చేరిన కాంతార!

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:38 IST)
కన్నడ సినిమా కాంతార చిత్రం దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించి కలెక్షన్ల రికార్డు సృష్టించింది. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ మూవీ దేశం అంతటా విమర్శకుల ప్రశంసలు, భారీ కలెక్షన్లను అందుకుంది. కానీ ఈ సినిమాపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ చిత్రం అటవీ-వాసి గిరిజనుల మనోభావాలకు వ్యతిరేకమని విమర్శలు వచ్చాయి. ఈ చిత్రం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. 
 
ఈ ఏడాది అతి తక్కువ బడ్జెట్‌తో తీయగా, అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం కాంతార నిలిచింది. ఈ సందర్భంలో, చిత్ర నిర్మాత విజయ్ మాట్లాడుతూ, 2023 సంవత్సరానికి కాంతార చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్ కోసం పంపినట్లు తెలిపారు. ఆఖరి నిమిషంలో కాంతార మూవీని ఆస్కార్ నామినేషన్లకు పంపడం అంచనాలను పెంచింది.
 
రిషనభ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించిన, హిట్ కన్నడ చిత్రం కాంతారా సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. కాంతారకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో కూడా విడుదలైంది.
 
ప్రేక్షకులతో పాటు, రజనీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియాలో సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ₹500 కోట్లకు పైగా వసూలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments