Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పులి చిత్రం బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ స్థాయిలో వుంటుంది: నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు

Advertiesment
H. Sudhakar Babu, Siju Wilson, Kayadu Lohar, Vinayan,. Damodar Prasad
, గురువారం, 15 డిశెంబరు 2022 (18:43 IST)
H. Sudhakar Babu, Siju Wilson, Kayadu Lohar, Vinayan,. Damodar Prasad
సిజు విల్సన్ ప్రధాన పాత్రలో కాయాదు లోహర్  కథానాయికగా తెరకెక్కిన మలయాళం యాక్షన్ పీరియడ్ డ్రామా 'పాథోన్‌పథం నూట్టండు'. వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీపడగా 'అమ్మదొంగ' లాంటి సూపర్ హిట్ చిత్రాలని నిర్మించిన ప్రముఖ సీనియర్ నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని 'పులి' అనే  టైటిల్ తో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'The 19th century' అన్నది ఉపశీర్షిక. ఈ రోజు పులి టీజర్ లాంచ్ ఈవెంట్ ని  గ్రాండ్ గా నిర్వహించారు.  హీరో సిజు విల్సన్, హీరోయిన్ కాయాదు లోహర్ , దర్శకుడు వినయన్, నిర్మాత సుధాకర్ బాబు, ప్రసాద్ నాయక్, కె ఎల్. దామోదర్ ప్రసాద్ తదితరులు టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
 
 అనంతరం నిర్మాత సిహెచ్. సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని తెలుగు లో విడుదల చేస్తునందుకు చాలా ఆనందంగా వుంది. సమాజంలో అసమానతలపై పోరాడిన ఓ వీరుడి కథ ఇది. అలాగే అనంతపద్మనాభ స్వామి నగలకు సంబధించిన చరిత్ర కూడా ఇందులో ప్రధాన కథాంశం. దర్శకుడు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని అద్భుతంగా తీశారు. సినిమాలో ప్రతి సన్నివేశం క్లైమాక్స్ లా వుంటుంది. ప్రతి ఫ్రేము రిచ్ గా వుంటుంది. ఇందులో నాలుగు పాటలు కూడా ఎక్స్ టార్డినరీగా వుంటాయి. త్వరలోనే పాటలు కూడా విడుదల చేస్తాం. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ స్థాయిలో 'పులి' సినిమా వుండబోతుంది. థియేటర్లో అనుభూతి చెందాల్సిన సినిమా పులి. ప్రేక్షకులు తప్పకుండా వచ్చి చూస్తారనే నమ్మకం వుంది. మా స్నేహితుడు ప్రసాద్ కూడా ఈ చిత్రంపై వున్న ఆసక్తితో సహ నిర్మాతగా జాయిన్ అయ్యారు. వాళ్ళ నాన్నగారి పేరు రామచంద్ర నాయిక్. మేమిద్దరం కలసి త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం. వారం రోజుల్లో డేట్ అనౌన్స్ చేస్తాం. ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా సినిమాని విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.
 
ఎస్.కె ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో గ్రాండ్ విజువల్స్, స్టన్నింగ్ మ్యూజిక్.. దర్శకత్వం. కథ.. అన్నీ అద్భుతాలే. ఈ సినిమాని చూసినప్పుడు తెలుగులో కూడా తీసుకొస్తే బావుంటుందనిపించింది. ఇది ఈ కాలాని సరిగ్గా సరిపోయే కథ. సుధాకర్ బాబు గారితో కలసి ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నాం. మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకులు ఆదరణ ఎప్పుడూ వుంటుంది. తెలుగు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో వున్నాయి. సినిమా విజువల్ ఫీస్ట్ లా వుంటుంది'' అన్నారు
 
హీరో సిజు విలన్స్ మాట్లాడుతూ.. నా మొదటి తెలుగు డబ్ మూవీ టీజర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. ఇది రియల్ లైఫ్ స్టొరీ. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందించాం. బిగ్ స్క్రీన్ పై అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది. గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన పాటలు, ఆరు ఫైట్ సీక్వెన్స్ లు అన్నీ అలరిస్తాయి. మలయాళంలో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది. నిర్మాత  సుధాకర్ బాబు, ఎస్.కె  రామచంద్ర నాయక్ , ఆల్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్ కి అల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు.
 
కాయాదు లోహర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. కేరళలో ఈ సినిమాని అద్భుతంగా ఆదరించారు. తెలుగు ప్రేక్షకుల నుండి కూడా అంతే గొప్ప ఆదరణ లభిస్తుందనే నమ్మకం వుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాని చూపిస్తున్న నిర్మాత సుదాకర్ గారికి కృతజ్ఞతలు. గొప్ప థియేటర్ ఎక్స్ పిరియన్స్ ఇచ్చే సినిమా ఇది. అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి'' అని కోరారు.
 
కె ఎల్. దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. పులి టీజర్ అద్భుతంగా వుంది. విజువల్స్ వండర్ ఫుల్ గా వున్నాయి. నిర్మాత సుధాకర్ బాబు సరైన సమయంలో సరైన సినిమా ఎంపిక చేసుకున్నారు. ఆయనకి అభినందనలు. మలయాళం నుండి ఆసక్తికరమైన కంటెంట్ వస్తోంది. వినయన్ గారు చాలా అనుభవం వున్న దర్శకుడు. ప్రస్తుతం ఇతర భాషల నుండి డబ్బింగ్ వస్తున్న సినిమాలు మంచి కంటెంట్ తో బాగా ఆడుతున్నాయి.  పులి ఇప్పటికే విడుదలైన మంచి విజయాన్ని సాధించింది. తెలుగులో కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని నమ్ముతున్నాను. టీం అందరికీ అల్ ది బెస్ట్'' తెలిపారు.
 
డైరెక్టర్ వినయన్ మాట్లాడుతూ.. తెలుగు వెర్షన్ టీజర్ లాంచ్ కి రావడం ఆనందంగా వుంది. ఈ సినిమా కథని రెడీ చేయడానికి నాలుగేళ్ళు పట్టింది. చాలా పరిశోధన చేశాం. చర్చలు జరిపాం. కేరళ చరిత్రలో దాగున్న కథ ఇది. సమాజంలోని ఒక దారుణానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడి కథ ఇది.  ఈ కథని ఎలాగైనా వెండి తెరపై చెప్పాలని అనుకున్నాను. కేరళ ప్రజలు ఈ సినిమాని అద్భుతంగా ఆదరించారు. అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. సిజు విలన్స్, కాయాదు లోహర్ ఇందులో అద్భుతంగా ఫెర్ ఫార్మ్ చేశారు. మంచి సినిమాకి తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ వుంటుంది. ఈ చిత్రానికి మీ అందరి  సపోర్ట్, ఆశీర్వాదం కావాలి'' అని కోరారు
ఎస్.కె రామచంద్రనాయక్ సహ నిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అనూప్ మీనన్, పూనమ్ బజ్వా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం. జయచంద్రన్ సంగీతం అందించగా, సంతోష్ నారాయణన్ నేపధ్య సంగీతం సమకూర్చారు. వివేక్ హర్షన్ ఎడిటర్ గా, అజయ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా, మాఫియా శశి, కె. రాజశేఖర్, ఎస్.జి. సోమసుందరం ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫుట్‌బోర్డు ప్రయాణం సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్‌.. నిజ జీవితంలో కాదు..