సినిమా రివ్యూ చెప్పేందుకు మీరెవరు? : సినీ నటి వరలక్ష్మి

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (12:47 IST)
సోషల్ మీడియా వేదికగా సినిమాలు రివ్యూ చేయడానికి ఒక బ్యాక్ గ్రౌండ్ ఉండాలని సినీ నటి వరలక్ష్మి అన్నారు. అస్సలు సోషల్‌మీడియా వేదికగా సినిమా రివ్యూలు ఎలా చెబుతారని, అలా చెప్పేవారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె తాజాగా మాట్లాడుతూ, 'కొత్త సినిమాలు రిలీజైన వెంటనే కొంతమంది వ్యక్తులు సోషల్‌మీడియా వేదికగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ సినిమాలో ఇది బాలేదు... అది బాలేదు.. అసలు సందేశమే లేదు అని ఏవేవో చెప్పేస్తున్నారు. అలాంటి వాళ్లందర్నీ నేను అడిగేది ఒక్కటే.. అసలు మీరు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారు?. 
 
ఎందుకంటే మొదట్లో అందరూ సినిమాని వినోదం కోసం చూసేవాళ్లు. ఇప్పుడు ఎంజాయ్‌ చేయడం మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు నెగెటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. సోషల్‌మీడియాలో ఇది మరీ ఎక్కువైపోయింది. కొన్నిసార్లు, వాళ్లిచ్చే రివ్యూలు అర్థంపర్థం లేకుండా ఉంటున్నాయి. సినిమా హిట్టు లేదా ఫ్లాప్‌ అని చెప్పడానికి మీరెవరు? అది బాగుందా? లేదా? అనేది ప్రేక్షకులను నిర్ణయించనివ్వండి. 
 
మీరు రివ్యూలు ఇవ్వాలనుకుంటే సినిమా విడుదలైన ఐదారు రోజుల తర్వాత చెప్పండి. ప్రేక్షకులకు సినిమాని చూసి ఆనందించే అవకాశం కల్పించండి. ఇదొక్కటే నా విన్నపం. అలాగే, కొంతమంది సినిమా కలెక్షన్స్‌ గురించి నెట్టింటి వేదికగా వాగ్వాదాలకు దిగుతున్నారు. ఇవన్నీ ఎందుకు? జీవితం చాలా చిన్నది దాన్ని ఎంజాయ్‌ చేయండి' అని వరలక్ష్మి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ట్విట్టర్‌లో పోస్ట్, నారా లోకేష్ వార్నింగ్

చొరబాటుదారులు కేన్సర్ రోగులు వంటివారు : కంగనా రనౌత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments