Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి హైట్‌, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలి.. సురేఖా వాణి

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (22:51 IST)
టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి.  భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోన్న సురేఖ రెండో వివాహంపై తరచూ ఆమెకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పడూ చెప్పే సురేఖ ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 
 
ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. 'నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి' అని చెప్పింది.
 
అలాగే మీకు నచ్చిన వ్యక్తి దొరికాడా? అని అడగ్గా.. ప్రస్తుతానికి ఎవరు లేరని సమాధానం ఇచ్చింది. అయితే అతను తనని బాగా అర్థం చేసుకునేవాడు కవాలని చెప్పింది. 'మంచి హైట్‌, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలి. లైట్‌గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments