Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ నన్ను మోసం చేసాడంటున్న 'గులాబి' మహేశ్వరి

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (19:52 IST)
గులాబీ. ఈ పేరు వింటేనే మహేశ్వరి గుర్తుకు వస్తుంది. 20 యేళ్ళ ముందు మహేశ్వరికి హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉండేది. మహేశ్వరి అంటే పడిచచ్చిపోయే అభిమానులు ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించిన మహేశ్వరికి గులాబీ సినిమాతో మంచి పేరే వచ్చింది.

 
అయితే చక్రవర్తితో నటించిన సినిమాకు దర్సకత్వం వహించాడు రాంగోపాల్ వర్మ. వర్మ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అందులోను హీరోయిన్‌గా ఉన్న మహేశ్వరితో ఒక ఆట ఆడుకున్నాడట వర్మ.

 
అదెలాగన్న విషయం ఆమె మాటల్లోనే... సినిమా షూటింగ్ ఎంతో ఆశక్తికరంగా సాగుతున్న వేళ. రాత్రి సమయంలో షూటింగ్. నాకు ముందే చీకటంటే భయం. చీకట్లో షూటింగ్ వద్దని చెప్పాను. అయితే ఈ సమయంలోనే చిత్రీకరించాలన్నాడు వర్మ.

 
సినిమా షూటింగ్‌కు ముందుగా ఒక ఛాలెంట్ ఇచ్చారు. చీకట్లో అర కిలోమీటర్ మెయిన్ రోడ్డు వరకూ వెళ్ళి రావాలన్నాడు. ఎవరూ సాహసించలేదు. అంతెందుకు హీరో చక్రవర్తి వెళ్ళలేదు. అయితే ఎంత భయం ఉన్నా.. నా భయాన్ని లోపలే దాచుకుని నేను నడిచి వెళ్ళా. చిమ్మచీకట్లో మెయిన్ రోడ్డుకు వెళ్ళి ఫోటో తీసి తిరిగి డైరెక్టర్‌కు వచ్చి చూపించాను. 

 
ఆయన ముందుగా బెట్ కట్టారు. అలా మెయిన్ రోడ్డుకు వెళ్ళి ఫోటోస్ తీసుకుని నాకు చూపిస్తే 50 వేలు అంటూ పందెం కట్టారు. నాకు డబ్బు ముఖ్యం కాదు. ఎవరూ సాహసం చేయలేదు కాబట్టి నేను సాహసం చేయాలనుకున్నాను. అందుకే ఇలా చేశానని.. అయితే తిరిగి వచ్చిన తరువాత వర్మ నాకు ఆ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారంటోంది మహేశ్వరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడితే మజా ఏముంటుంది : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలో గ్రూపు-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

వైకాపా సోషల్ మీడియా మాఫియా... బూతుపురాణం అప్పుడే మొదలు..?

అంతా జగనే చేయించారు.. కోడలు పిల్లను కూడా వదల్లేదు.. షర్మిల ఫైర్

విషపు నాగులను కాదు.. అనకొండను అరెస్టు చేయాలి : వైఎస్ షర్మిల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments