Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌కు ఆ టాలెంట్ లేదులెండి?: మాధవీలత సెన్సేషనల్ కామెంట్స్

నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొంది. చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది. కానీ సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ కారణంగా

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (17:29 IST)
నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొంది. చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది. కానీ సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ కారణంగానే ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. దీంతో మాధవీలత కోలీవుడ్‌కి మకాం మార్చేసింది. అక్కడా సక్సెస్ లేకపోవడంతో ఆఫర్లు లేక వెనక్కి తగ్గాల్సి వచ్చింది. టాలెంట్ వుండీ రాణించలేకపోవడానికి కారణం ఏమిటని అడిగిన ఓ ప్రశ్నకు మాధవీలత గతంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 
ఇండస్ట్రీలో ఎవరికీ లొంగకపోవడం వల్లే తనకీ పరిస్థితి వచ్చిందని కూడా చెప్పింది. ఓ నిర్మాతకు నో చెప్పడంతో తనకు వేధింపులు మొదలయ్యాయని.. తాను నోరు విప్పితే ఎంతమంది కాపురాలు కూలిపోతాయే తెలియదని పరోక్షంగా హెచ్చరించింది. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది పరిస్థితి ఇదేనని క్లారిటీ ఇచ్చేసింది. 
 
అలాగే శ్రీరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీపై, తెలుగమ్మాయిలకు అవకాశాలు లభించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా సుచీలీక్స్ తరహాలో శ్రీరెడ్డి కూడా లీక్స్ మొదలెట్టేసింది. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలను టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తప్పుబట్టింది.  తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అస‌లు ''కాస్టింగ్ కౌచ్'' అనేదే లేద‌ని స్ప‌ష్టం చేసింది. తానెప్పుడూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేద‌ని చెప్పింది.
 
ఈ వ్యాఖ్యలపై మాధవీలత స్పందించింది. ర‌కుల్ మాట‌ల‌కు తెలుగు హీరోయిన్ మాధ‌వీ ల‌త కౌంట‌ర్ ఇచ్చింది. ర‌కుల్ చెప్పింది పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. కాస్టింగ్ కౌచ్‌ లేదంటూ ర‌కుల్ చెప్పడంలో ఏమాత్రం నిజం లేదంది. తెలుగులో హీరోయిన్ల‌కు లైంగిక వేధింపులు ఎదుర‌వుతున్నాయ‌న్న‌ది ప‌చ్చి నిజమని వెల్లడించింది. కాకపోతే, తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో దీని గురించి మాట్లాడ‌డానికి హీరోయిన్లెవ‌రూ ముందుకు రారు. జ‌నాల‌ను పిచ్చి వాళ్ల‌ను చెయ్య‌డానికి ఇలాంటి అబ‌ద్ధాలు చెప్ప‌కూడ‌ద‌ని మాధ‌వీ లత తెలిపింది.
 
తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై మాధవీలత స్పందించింది. ఇప్పటికే పవన్ ఆహ్వానిస్తే జనసేనలో చేరుతానని చెప్పిన మాధవీలత పవన్ రాజకీయాలపై నోరు విప్పారు. ఇప్పుడున్న రాజకీయ నేతలు జనాలను గొప్పగా మోసం చేస్తారని.. అలా జనాలను మోసం చేసేందుకు అనుభవం వుండాలని.. అంత అనుభవం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు లేదని హీరోయిన్ మాధవీలత వెల్లడించింది. జనాలను పవన్ మోసం చేయలేరని.. కష్టపడి సంపాదించిన డబ్బునే వదిలేసుకునే పవన్, జనాలను ఎలా దోచుకుంటారని చెప్పింది.
 
అమరావతిలో పవన్ కల్యాణ్ ఇల్లు కట్టుకోవడం నేరమా? అని మాధవీ లత అడిగింది. ఎవరెవరో పేరు తెలియని వ్యక్తులు బిల్డింగులు, ప్యాలెస్‌లు కట్టుకుంటే.. పవర్ స్టార్ ఇల్లు కట్టుకోకూడదా అంటూ ప్రశ్నించింది. కొత్తగా వచ్చిన హీరోలకు కూడా పెద్దపెద్ద విల్లాలు ఉన్నాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం