ఆ డైరెక్టర్‌తో బాగా కనెక్టయిన సాయిపల్లవి...

తెలుగు సినీపరిశ్రమలో సాయిపల్లవి అంటే తెలియని వారుండరు. ఒకే ఒక్క సినిమాతో తానేంటో నిరూపించుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఫిదా సినిమా తరువాత సాయి పల్లవికి చాలానే ఛాన్సులొచ్చాయి. కానీ తనకు నచ్చిన కథ, తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంటేనే ఆ సిని

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (16:44 IST)
తెలుగు సినీపరిశ్రమలో సాయిపల్లవి అంటే తెలియని వారుండరు. ఒకే ఒక్క సినిమాతో తానేంటో నిరూపించుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఫిదా సినిమా తరువాత సాయి పల్లవికి చాలానే ఛాన్సులొచ్చాయి. కానీ తనకు నచ్చిన కథ, తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలకు ఓకే అంది సాయిపల్లవి. మిగిలిన సినిమాలను చేయనని తేల్చి చెప్పేసింది.
 
ఫిదా తరువాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదనే చెప్పాలి. దీంతో సాయిపల్లవి తనకు గతంలో ఉన్న పేరును తీసుకువచ్చే సినిమాను ఎవరైనా చేస్తే చేయడానికి సిద్ధంగా ఉంది. అలాంటి కథ, హిట్ సినిమాల డైరెక్టరే సాయిపల్లవికి దొరికాడు. అతనెవరో కాదు నీది నాదీ ఒకే కథ డైరెక్టర్ వేణు. సాయిపల్లవి కోసం ప్రత్యేకంగా వేణు ఒక కథను సిద్థం చేసి ఆమెకు వినిపించాడట. 
 
ఇది సాయిపల్లవికి బాగా నచ్చింది. ఫిదా తరువాత అంతటి పేరు ఈ సినిమాకు ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం సాయిపల్లవితో ఏర్పడింది. దీంతో సాయిపల్లవి ఆ డైరెక్టర్‌కు ఫిదా అయ్యిందని తెలుగు సినీపరిశ్రమలోని వారు చెవులు కొరుక్కుంటున్నారు. మీ కథ నాకు బాగా నచ్చింది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించినా నేను రావడానికి సిద్థంగా ఉన్నానని దర్శకుడు వేణుకు చెప్పిందట సాయిపల్లవి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments