పవన్ కల్యాణ్ పార్టీలో చేరేది లేదు.. అవన్నీ మీడియా కథనాలే: జేడీ
						
		
						
				
జనసేనలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వార్తలపై జనసేనాని కూడా స్పందించారు. జేడీకి పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని కూడా చెప్పారు. ఈ వార్తలపై జేడీ స్పంది
			
		          
	  
	
		
										
								
																	జనసేనలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వార్తలపై జనసేనాని కూడా స్పందించారు. జేడీకి పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని కూడా చెప్పారు. ఈ వార్తలపై జేడీ స్పందించారు. జనసేనలో చేరుతున్నట్టు తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. ఇవన్నీ మీడియా సృష్టించిన కథనాలని తోసిపుచ్చారు. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవమేనని, తన దరఖాస్తును మహారాష్ట్ర సర్కారు పెండింగ్‌లో పెట్టిందన్నారు. తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు.
	 
	ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయ ప్రకాశ్ నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. జేఎఫ్‌సీపై తొలుత పవన్ చూపిన శ్రద్ధ ప్రస్తుతం లేదన్నారు. నివేదికలో వెల్లడించిన అంశాలపై తదుపరి కార్యచరణ కొరవడిందని జేపీ అన్నారు. స్వతంత్ర నిపుణులతో మరో కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. తమ ప్రయత్నాన్ని రెండో దశ పోరాటంగా అభివర్ణించిన జేపీ కేంద్రం అవకాశం ఇస్తే వివరాలు తెలియజేస్తామన్నారు.