Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామం.. కాటికి కాలు చాపిన ముసలి వాడి కళ్లలోనూ జ్వలిస్తూనే : మాధవీలత

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ బలంగా ఉందనే విషయం ఇపుడిపుడే వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా నటి శ్రీరెడ్డి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనకు దిగడంతో పరిస్థితి మరింత విషమించింది. ఇదే

Webdunia
శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (15:57 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ బలంగా ఉందనే విషయం ఇపుడిపుడే వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా నటి శ్రీరెడ్డి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనకు దిగడంతో పరిస్థితి మరింత విషమించింది. ఇదే అంశంపై మరో సినీ నటి మాధవీలత మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీ అంటే తమకు ఎంత ఇష్టమో చెబుతూనే.. క్యాస్టింగ్ కౌచ్‌కు ఎలా బలైపోతున్నారో ఆమె వెల్లడించింది.
 
'ఇది భయం కాదు మా బతుకు. ప్రేమతో వచ్చాం. చావైనా రేవైనా ఇక్కడే. జారిపోయేది లేదు, పారిపోవడం అంతకన్నా లేదు. కామం.. కాటికి కాలు చాపిన ముసలి వాడి కళ్లలో కూడా జ్వలిస్తూనే ఉంది. అయినా బదిలీ అవుదామంటే అది లేనిదెక్కడ? ఒక్క సినీ రంగమేనా? బతకాలంటే బరితెగించాలి లేదా బాధను దిగమింగాలి. చీకటిలో నలిగిపోయిన చెప్పుకోలేని కథలు, విప్పలేని ముడులు ఎన్నో, కన్నీళ్లతో కష్టం తీరిపోతే ఇన్నాళ్లుగా ఈ బాధలెందుకు?
 
ఏరి కోరి వచ్చినందుకు పక్కలోకి చేరుకోవడం తప్పడం లేదు అయినా ఈ సినిమా పిచ్చి మాకు ఇష్టం. మిమ్మల్ని నవ్వించడానికి మేము నవ్వుల పాలుకాక తప్పడం లేదు. అయినా మాకు సినిమా ఇష్టం. మేము చచ్చే వరకు మిమ్మల్ని ఆనందపెట్టడానికి మేకప్‌తో వస్తూనే ఉంటాం. సినిమా చూడకుండా మేము బతకగలం అని చెప్పండి. హీరోయిన్ సాంగ్స్‌లో ఎంత ఒళ్లు చూపిస్తుందా అని నోరు తెరుచుకుని చూసే మీరా మాట్లాడేది? అంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments