Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 14 March 2025
webdunia

ఔను... మన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. శ్రీరెడ్డికి నా మద్దతు : నటి అర్చన

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డికి మరో నటి మద్దతు లభించింది. ఆ నటిపేరు అర్చన. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వంటి హిట్ చిత్రంతో పాటు బిగ్‌బాస్‌ రియాల్టీ ష

Advertiesment
ఔను... మన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. శ్రీరెడ్డికి నా మద్దతు : నటి అర్చన
, గురువారం, 12 ఏప్రియల్ 2018 (19:21 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డికి మరో నటి మద్దతు లభించింది. ఆ నటిపేరు అర్చన. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" వంటి హిట్ చిత్రంతో పాటు బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో కనిపించి, హల్‌చల్ చేసింది. ఈమె ఇపుడు క్యాస్టింగ్ కౌచ్‌పై పెదవి విప్పింది.
 
ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై నటి అర్చన మాట్లాడుతూ... 'అవును మన ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. నా వరకు వచ్చిన ప్రతీ సినిమాలో నటించాను. నేను సినిమా రాలేదని ఎన్నడూ ఇబ్బంది పడలేదు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. ఈ కౌచ్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత పెద్ద స్ట్రాంగ్ సబ్జెక్టు గురించి ఒపీనియన్స్ ఇస్తున్నారు చాలా సంతోషకరమైనది. 
 
ముఖ్యంగా, సహచర నటి శ్రీరెడ్డి చేస్తున్న పని కేవలం చర్చలకే పరిమితం కాకుండా సీరియస్‌గా యాక్షన్స్ తీసుకొని ముందుకెళ్లాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒకచోట ఇబ్బందులు పడేవుంటారు. ఒక తప్పు జరిగిందంటే అందులో అబ్బాయి, అమ్మాయి ఇద్దరి పాత్ర ఉంటుంది. కేవలం అమ్మాయిదే తప్పని వేలెత్తి చూపడం, క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా చూపడం ఇలాంటి పద్దతులన్నీ మారాలి అని వ్యాఖ్యానించారు. 
 
అదేసమయంలో శ్రీరెడ్డి కాస్త అగ్రెసివ్‌గా రియాక్ట్ అయింది. తను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని నిజం ఒప్పుకుంది. సాటి అమ్మాయిగా నేను శ్రీరెడ్డికి సపోర్టు ఇస్తున్నాను. 'క్యాస్టింగ్ కౌచ్' వంటి విషయాల్లో అమ్మాయిలు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇలా ఎవరైతే సమస్యను ఎదుర్కొన్నారోవారిని బహిష్కరించడం సరైన పద్దతి కాదు.. పరిష్కారం అంతకంటే కాదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరెడ్డికి సపోర్టుగా రావాల్సింది పోయి బహిష్కరించడం ముమ్మాటికి తప్పే. ఆ అమ్మాయికి మేమున్నాం.. భయపడకు అని ధైర్యం చెప్పాల్సింది పోయి బహిష్కరించడం మానవత్వం కానేకాదని అర్చన చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యుఎస్‌లో "రంగస్థలం" జోరు : సక్సెస్‌మీట్‌లో కలవనున్న మెగాబ్రదర్స్