Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఫ్ ఆఫ్ రామ్‌కి జ్యోతిక స‌పోర్ట్..!

విల‌క్ష‌ణ న‌టి మంచు లక్ష్మి నటించిన తాజా సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. రాజ‌మౌళి శిష్యుడు విజయ్ యెలకంటి ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించారు. సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్ టైన్మెంట్ సంయుక్తంగా

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (19:26 IST)
విల‌క్ష‌ణ న‌టి మంచు లక్ష్మి నటించిన తాజా సినిమా ‘వైఫ్ ఆఫ్ రామ్’. రాజ‌మౌళి శిష్యుడు విజయ్ యెలకంటి ఈ చిత్రానికి  దర్శకత్వం వ‌హించారు.  సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తోన్న వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా క‌థానాయిక జ్యోతిక వైఫ్ ఆఫ్ రామ్ గురించి త‌న స్పంద‌న‌ను తెలియ‌చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేయ‌డం విశేషం.
 
మంచు ల‌క్ష్మి వండ‌ర్‌ఫుల్ ప‌ర్స‌న్. సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు పోషిస్తోంది. మ‌రోవైపు టివీలో షోస్ ద్వారా ఎంతోమందికి స‌హాయం చేస్తూ స్పూర్తి క‌లిగిస్తోంది. చాలా స్ట్రాంగ్ ప‌ర్స‌న్. వైఫ్ ఆఫ్ రామ్ ఈ నెల 20న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుని మంచు ల‌క్ష్మి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
 
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు న‌టించిన ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్అలీ అక్బర్, ఎడిటర్ : తమ్మిరాజు,  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ నాయుడు,మాటలు : సందీప్ రెడ్డి గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు,  రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments