Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు రేవ్ పార్టీ కేసు : జైలు నుంచి విడుదలైన నటి హేమ

వరుణ్
శుక్రవారం, 14 జూన్ 2024 (16:06 IST)
బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సినీ నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీనటి హేమ అరెస్టయిన విషయం తెలిసిందే. గురువారం ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు.
 
కొన్నాళ్ల క్రితం బెంగళూరు నగర శివారులో ఒక ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చి చట్ట ప్రకారం ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెను బెంగుళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విచారించి అరెస్టు చేశారు. 
 
ఆమెను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా హేమకు కోర్టు బెయిల్ రావడం పోలీసులు జైలు నుంచి విడుదల చేశారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని ఆమెపై ఆరోపణలు వచ్చిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. 
 
హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల దగ్గర సాక్షాలు లేవని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. 
 
తాను డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి హేమ చెబుతూ వచ్చారు. అయితే తాను బెంగళూరులో ఉన్నా సరే హైదరాబాదులో ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలోనే బెంగళూరు పోలీసులు సైతం హేమపై సీరియస్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments