బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో సినీ నటి హేమను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆ రేవ్ పార్టీలో తాను లేనని తొలుత హేమ బుకాయించింది. తాను హైదరాబాద్ నగరంలో ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేసింది. కానీ ఈ పార్టీకి 73 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారని, అందులో హేమ కూడా ఉందని పోలీసులు తేల్చి చెప్పారు. 59 మంది పురుషుల రక్త నమూనాలను పరీక్షించగా, 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్‌గా పరీక్షించారు. మొత్తంమీద, 103 మంది వ్యక్తులలో 86 మంది మాదకద్రవ్యాల వాడకాన్ని నిశితంగా పరీక్షించారు. ఈ కేసు విచారణ నిమిత్తం, హేమకు నోటీసులు ఇచ్చినా.. అనారోగ్య కారణాలను హేమ సాకుగా చెప్పి, విచారణకు హాజరు కాలేదు. సోమవారం బెంగుళూరు పోలీసులు హెబ్బగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ వినియోగించిన కేసులో హేమను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
ఇక ఈ కేసులో హేమపై అరోపణలు నిరూపితమైతే.. పోలీసులు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మా అసోసియేషన్ యాక్షన్ తీసుకుంటుందని గతంలో మా అధ్యక్షుడు విష్ణు ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. మరీ హేమ డ్రగ్స్ తీసుకుందన్నది నిజం.. దాన్ని ఆమెకు ఎవరిచ్చారనే దానిపైనే పోలీసులు విచారణ జరగనుంది. రేవ్ పార్టీ ఆర్గనైజర్స్ ఎవరనే దానిపై కూడా క్లారిటి రావాల్సి ఉంది. మరోపక్క డ్రగ్స్‌ను రూపుమాపాలంటూ.. గతంలో స్వయానా ఇప్పటి మా కమిటీ పోలీసులను కలిసింది. అలాంటిది మా సభ్యురాలైన హేమ ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందని తెలటంతో.. మంచు విష్ణు, ఇంతకముందు తాను చెప్పినట్లుగా, హేమ చేసిన తప్పుపై యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు. ఏ విధంగా తీసుకుంటారనే చర్చ మొదలైంది..!