Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ ఉంటే సరేసరి.. లేకుంటేనా.. వామ్మో పవన్‌తో చతురుకాదు.. : అంజలి

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:15 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇందులో అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రలలో నటించారు. ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూ కథ తిరుగుతుంది. 
 
ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, హీరోయిన్ అంజలి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 'వకీల్ సాబ్' సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. ఇందులో తన పాత్ర గురించి దర్శకుడు వేణు శ్రీరామ్ గురించి చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యానని.. ఇలాంటి మంచి కథ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. 
 
అంతేకాదు పవన్ కళ్యాణ్ సెట్‌లో ఎలా ఉంటాడో అనే విషయంపై కూడా ఓపెన్ అయిపోయింది. షూటింగ్ ఉంటే ఓకే.. లేకపోతే కామ్‌గా ఒక మూలన కూర్చుంటారని.. తన పుస్తకాలే తన ప్రపంచం అని చెప్పుకొచ్చింది. లేదంటే పడుకొని విశ్రాంతి తీసుకుంటారని అంజలి తెలిపింది. 
 
ఇక ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్‌గా ఉండే క్యారెక్టర్ చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా ఒక సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని.. అది చూసి సెట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ చప్పట్లు కొట్టడం తన జీవితంలో మరిచిపోలేని విషయం అంటుంది. 
 
ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు మరింత పెరుగుతాయని నమ్మకంగా చెబుతోంది ఈ తెలుగమ్మాయి. ఈ సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు శ్రుతి హాసన్ కూడా నటిస్తోంది. ఈమె క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా వకీల్ సాబ్ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments