Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిధి అగర్వాల్‌కు మరో లక్కీ ఛాన్స్! .. కలిసివస్తున్న ఎత్తు!

Advertiesment
Nidhi Agarwal
టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్‌ను సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా దగ్గుబాటి రానాతో కలిసి రొమాన్స్ చేసేందుకు సిద్దమైంది. 
 
ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తరువాత వచ్చిన 'మిస్టర్ మజ్ను' సినిమాతో ఈ అమ్మాయి కుర్రాళ్లకు కుదురు లేకుండా .. కునుకు లేకుండా చేసింది. 
 
అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ ఈ పిల్ల గ్లామర్‌‌కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అందానికి అదృష్టం కూడా తోడైతే బాగుంటుందని ఈ సుందరి అనుకుంటున్న సమయంలోనే, 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ పడింది. ఆ హిట్టే ఈ బ్యూటీని గట్టెక్కించింది. 
 
ఈ హిట్ కారణంగా ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించే 'హరిహర వీరమల్లు'లో నిధి అగర్వాల్ నటిస్తోంది. పిల్ల మంచి హైట్ కావడంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో తాజాగా రానా జోడీగా కూడా అవకాశాన్ని దక్కించుకుందని చెబుతున్నారు. ఒక సీనియర్ డైరెక్టర్ .. ఒక పెద్ద బ్యానర్లో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే అందాలనిధికి అదృష్టం కలిసొచ్చిందనే అనిపిస్తోంది.
 
అలాగే, తమిళంలోనూ పలు సినీ అవకాశాలను దక్కించుకుంటుంది. ఇప్పటికే శింబు హీరోగా నటించిన ఈశ్వరన్ చిత్రంలో ఈ అమ్మడు ఆడిపాడింది. ఆ తర్వాత మరికొందరు హీరోలతో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌జ‌నీకాంత్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ