పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఇపుడు ఆయన సరసన నటించే అవకాశం వచ్చిందంటే నమ్మశక్యంగా లేదని హీరోయిన్ నిధి అగర్వాల్ అంటోంది. పవన్ నటించే కొత్త చిత్రం హరిహర్ వీరమల్లులో నిధి అగర్వాల్‌కు అవకాశం లభించింది.
దీనిపై ఆమె తాజాగా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌కి తాను పెద్ద అభిమాని. ఆయన సినిమాలను చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేయాలన్న తన కల హరిహర వీరమల్లులో నెరవేరుతోందని తెలిపింది. ఈ విషయం తలచుకుంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు అని వ్యాఖ్యానించింది.
అయితే, పవన్ కల్యాణ్ గొప్ప నటుడని, అటువంటి నటుడితో కలిసి పని చేస్తుండటం గొప్ప అనుభూతినిస్తోందని, ఇది నిజంగా తనకు దేవుడు ఇచ్చిన గొప్పవరంగా చెప్పుకొచ్చింది. పవన్ చుట్టూ తెలియని ఏదో శక్తి దాగి ఉందని చెప్పుకొచ్చింది. ఆయన సెట్‌లో అడుగుపెట్టగానే అందరూ పనులను ఆపేసి ఆయననే చూస్తుంటారని చెప్పింది.
రిహార్సల్స్ చేయాల్సివస్తే పవన్ కల్యాణ్ దాన్ని పనిలాకాకుండా ఆనందంగా చేస్తుంటారని తెలిపింది. పవన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. హరిహర వీరమల్లులో తన పాత్ర అసాధారణమైందని, ఇది పీరియాడికల్ డ్రామా కావడంతో తాను అందుకు తగ్గ వస్త్రాల్లోనే కనిపిస్తానని తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర కోసం మేకప్‌కు 90 నిమిషాలు పడుతోందని చెప్పింది.