Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్ప‌టివ‌ర‌కు ఏ డైరెక్ట‌ర్‌ని అడ‌గ‌లేదు... ఫ‌స్ట్ టైమ్ అత‌న్నలా అడిగా - సూర్య‌

Webdunia
బుధవారం, 1 మే 2019 (14:51 IST)
హీరో సూర్య కొత్త సినిమా ఎన్‌.జి.కె. పొటిలికల్‌ డ్రామా, థ్రిల్లర్‌ అని అందరూ అంటున్నారు. కానీ, మరో యాంగిల్‌లో ఉండే సినిమా ఇది. 2000 సంవత్సరం తర్వాత రాజకీయ ఘటనలను అబ్జర్వ్‌ చేసిన డైరెక్టర్‌ శ్రీరాఘవ గారి స్టైల్లో సాగే సినిమా ఇది. ఇప్పటివరకు ఏ దర్శకుడినైనా అడిగానో లేదో తెలియదు కానీ.. తొలిసారి శ్రీరాఘవగారిని 'నాతో సినిమా చేస్తారా?' అని 2002లో అడిగాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం ఆనందాన్ని కలిగించింది అని హీరో సూర్య తెలియ‌చేసారు. 
 
అంతేకాదు నా కల నిజమైన భావనను కలిగిస్తోంది. ఈ సినిమా లొకేషన్‌కి వెళుతున్న ప్రతిరోజూ కొత్తగా పనిచేస్తున్నట్లుగా అనిపించింది. ప్రతి క్రాఫ్ట్‌ని ఆయన ఉపయోగించుకునే తీరు చూసి ఆశ్చర్యపోయాను. మనం ఓ సీన్‌ను ఇలా చేస్తారేమో! అని ఆలోచించుకుని వెళితే, దాన్ని మించి ఉండేలా తెరకెక్కిస్తారాయన. పనిని ప్రేమించి, ప్యాషన్‌తో చేయడం ఆయన అలవాటు. ఈ సినిమా తర్వాత మరో కథను ఆలోచిస్తే, ఆ కథను ముందు నాకే చెప్పాలనుకుంటున్నాను.
 
ఎందుకంటే... ఆయనతో మరో సినిమా చేయాలని ఆశపడుతున్నాను. ఇక సంగీతం విషయానికి వస్తే... మనకు ఎందరో గొప్ప సంగీత దర్శకులు ఉన్నారు. ఈ జనరేషన్‌లో బెస్ట్‌ మ్యూజిక్‌ క్రియేటర్‌ ఎవరైనా ఉన్నారా? అని మాట్లాడుకుంటే యువన్‌ శంకర్‌రాజాకు తప్పకుండా స్థానం ఉంటుంది. యువన్‌ మ్యూజిక్‌లో పనిచేయడం సంతోషాన్నిచ్చింది. ఎడిటర్‌ ప్రవీణ్‌ కె.ఎల్‌, అద్భుతమైన విజువల్స్‌ అందించిన సినిమాటోగ్రాఫర్‌ శివకుమార్‌గారు ఇలా.. ప్రతి ఒక్కరూ కమిట్‌మెంట్‌తో తమ సినిమా అనుకుని వర్క్‌ చేశారు. వారికి మాటల్లో థాంక్స్‌ చెబితే సరిపోదేమో. 
 
సాయిపల్లవి తన పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకుని చేసింది. ఈ సినిమాకు ప్రభు, ప్రకాశ్‌ రూపంలో మంచి నిర్మాతలు దొరికారు. కథను నమ్మి యూనిట్‌కి ఎలాంటి సపోర్ట్‌ కావాలో దాన్ని అందించారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. మే 31న ఈ సినిమా విడుదల కాబోతోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా అభిమానుల అంచనాలకు ధీటుగా ఉంటుందిస‌స అని హీరో సూర్య అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments