Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీపై పోటీ చేసిన మాజీ సైనికుడుకి ఈసీ నోటీసులు

మోడీపై పోటీ చేసిన మాజీ సైనికుడుకి ఈసీ నోటీసులు
, బుధవారం, 1 మే 2019 (11:15 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీకి సమాజ్ వాదీ పార్టీ తరుపున బరిలోకి దిగిన బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహుదూర్ సింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న జవానులకు సరైన ఆహరం అందడంలేదని, నాణ్యమైన భోజనం పెట్టడంలేదని బహుదూర్ సింగ్ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలతో అధికారుల ఆగ్రహానికిగురై ఉద్యోగాన్ని కోల్పోయాడు.
 
అనంతరం ఎస్పీలో చేరడంతో ఆయనకు టికెట్ కేటాయించింది. నామినేషన్ సమయంలో తాను సర్వీసు నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొన్నాడు. కానీ తర్వాత సమర్పించిన పత్రాల్లో ఆయన ఆ విషయాన్ని పేర్కొనలేదు. ఈ లోపాలను గుర్తించిన ఈసీ ఆయనకు నోటీసులు ఇచ్చి, మే 1వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవినీతి, దేశద్రోహ ఆరోపణల మీద సర్వీసు నుంచి డిస్మిస్ అయిన వారు ఐదేళ్ల పాటు ప్రచారానికి అనర్హులు.
 
కాగా, ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఈయనపై కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ శర్మ పోటీ చేస్తుండగా, ఎస్పీ నుంచి తేజ్ బహుదూర్ సింగ్ పోటీ చేస్తున్నాడు. ఈయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విష‌యంలో నాగార్జున త‌ప్పు చేసాడా..?