ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఠాగూర్
సోమవారం, 17 నవంబరు 2025 (19:24 IST)
చిత్రపరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీపై హైదరాబాద్ నగర పోలీసులు పైచేయి సాధించారు. ఈ పైరసీకి మూలకారకుడుగా ఉన్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసిన జైలుకు తరలించారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే, నటుడు శివాజీ మాత్రం మరోలా స్పందించారు. ఇమ్మడి రవి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. రవి ఇకనైనా మారాలని హితవు పలికారు.
 
ఐబొమ్మ ద్వారా తాను చాలామందికి ఉపయోగపడుతున్నానని రవి భావించివుండొచ్చని, కానీ, అది ఎంతో మందిని ఇబ్బంది పెట్టిందని అన్నారు. మనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. రవిలో ఇప్పటికైనా మార్పు రావాలని శివాజీ ఆకాంక్షించారు. సినిమాను థియేటర్‌లో చూసే అనుభూతి మరెక్కడా రాదన్నారు. 
 
ప్రపంచంలో అన్నిటికంటే చౌకైనది ఏదైనా ఉందంటే అది సినిమా మాత్రమేనని చెప్పారు. మూడు గంటల సినిమా నచ్చితే జీవితాంతం గుర్తుండిపోతుందని, ఇందుకు ఉదాహరణే సీనియర్ ఎన్టీఆర్ నటించిన మిస్సమ్మ, పాతాళభైరవి వంటి చిత్రాలన్నారు. ఇప్పటికైనా పైరసీని ప్రోత్సహించకుండా, సినిమాను థియేటర్‌లో చూడాలని శివాజీ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సౌదీ బస్సు ప్రమాదం.. 45మంది మృతి.. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి

వెస్ట్ బెంగాల్ రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలు నిల్వ చేశారా?

Rayalaseema: రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ.. ధ్వజమెత్తిన వైకాపా

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments