Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

Advertiesment
Indian Animation Movie Kiki & Coco

దేవీ

, సోమవారం, 17 నవంబరు 2025 (16:16 IST)
Indian Animation Movie Kiki & Coco
ఇటీవల అనిమేషన్ చిత్రాలు  ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఆపాదిస్తున్నాయి. ప్రత్యేకంగా బాలల చిత్రాలు నిర్మించడానికి ఎవరు ముందుకు రావడంలేదు. కాని వారికి అర్ధమయ్యేలా వినోదాత్మకంగా చిత్రాలు అందిస్తే తప్పక ఆదరిస్తారు. ఇండియన్ స్క్రీన్ పై లయన్ కింగ్, అలాద్దిన్, వంటి కొన్ని అనిమేషన్ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు పొందుతూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నాయి. అంతఎందుకు  జూలై లో విడుదల అయిన 'మహా అవతార్ నరసింహ' అనిమేషన్ చిత్రం, పిల్లలని, పెద్దలని విశేషంగా ఆకట్టుకుని రికార్డు స్తాయి వసూల్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
 
ప్రస్తుతం  ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకునే ఓ  ఇండియన్ అనిమేషన్ సినిమా “కికీ & కోకో” త్వరలో విడుదల కాబోతుంది.  ప్రపంచవ్యప్తంగా ఎల్లలు దాటి, పలు భాషల్లో ఈ చిత్రం  విడుదల కాబోతుంది.  పూర్తిగా భారత సినీ ఇండస్ట్రీ నుండి ఇక్కడి సాంకేతిక నిపుణులతో విభిన్న తరహాలో  తొలి సారిగా  పీ. నారాయణన్ దర్శకత్వంలో రూపొందించిన   అనిమేషన్ చిత్రం కికీ & కోకో.
 
ఈ సందర్భాగా దర్శకుడు పీ. నారాయణన్ మాట్లాడుతూ, ఇది పిల్లలకే పరిమితం కాదు పెద్దల్లోనూ చిన్నప్పటి మధురానుభూతులను మరోసారి గుర్తు చేసే మాయా శక్తి ఇందులో ఉంది. చిన్నారుల వినోదం, విద్యకు కొత్త నిర్వచనం చూపే వినూత్న చిత్రం ఇది. కికీ అనే చాలా ప్రేమికమైన పెంపుడు జంతువు, కోకో అనే చిన్నారి మధ్య ఉన్న అపూర్వమైన బంధాన్ని ఈ చిత్రం చెబుతుంది. ప్రేమ, జీవిత పాఠాలు, అద్భుత క్షణాలతో నిండిన వారి ప్రయాణం అన్ని వయసుల ప్రేక్షకుల హృదయాలను తాకేలా రూపొందించబడింది. అనిమేషన్ యొక్క అసలు మేజిక్  ఏ వయసు వారినైనా అలరిస్తూ, ప్రేరేపించే  శక్తి  ఉంటుంది. అలాంటి అనిమేషన్ ప్రపంచంలో అడుగుపెడుతూ,  మా తొలి  ప్రయత్నం ‘కికీ & కోకో’ ఈ రోజుల్లో నేటి బాలలను నిజంగా ప్రభావితం చేసే విద్యా కథలు చాలా అవసరం. కికీ & కోకో అనేది స్నేహం, ప్రేమ, ఒక పిల్లవాడు తన పెంపుడు జంతువు మధ్యున్న మాంత్రిక బంధం గురించి అందరి హృదయాలను  హత్తుకునే కథ. ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేమంతా కృషి చేసాము. అనిమేషన్ చిత్రాలు కేవలం హాలీవుడ్ వారు మాత్రమే తీయగలరు అనుకునే వారికీ మేము ఈ జోనర్ లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ  కూడా సిద్ధంగా ఉందని సగౌవరంగా చెప్పగలము." అన్నారు.
 
ఇనికా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్ ప్రొడ్యూసర్  జి.యం.కార్తికేయన్ మాట్లాడుతూ, కికీ & కోకో ఒక సినిమా మాత్రమే కాదు. ఇది స్నేహం, ప్రేమ, కథల ద్వారా పిల్లలు నేర్చుకునే విలువైన పాఠాల వేదిక. ఈ మాంత్రిక ప్రయాణాన్ని అందరూ తమ హృదయాలతో స్వాగతించాలని  ఆహ్వానం పలుకుతున్నాము. కికీ & కోకో చిత్ర  థియేటర్లలో మాత్రమే చూసి ఆనందించాలి.  ఇందులో  ప్రత్యేక మెర్చండైజ్, విద్యా రూప కల్పనలు,   ప్రేక్షకుల జీవితాల్లోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా రూపొందించాము. యావత్ కుటుంభ సభ్యులు కలసి చూసే చిరస్మరణీయమైన అనుభూతులను పంచె  చిత్రంగా మీ ముందుకు రాబోతుంది".అని తెలిపారు.
 
పాత్రధారులు  : కికీ అనే కుక్క పాత్ర, కోకో  అనే చిన్నారి పాత్ర.
టెక్నికల్ టీం :
డైరెక్టర్ : పి.నారాయనణ్
కాన్సెప్ట్, క్రియేటివ్ డైరెక్టర్ : గోకుల్ రాజ్ భాస్కర్,
రచయితలు : అశ్విన్ విశాల్ తియోదొర్, విశ్మయ మణి,
డైరక్షన్ టీం : హరి రారోత్,
కంటెంట్ స్టార్ట్జిస్ట్ : శ్రీ హరి పి, శ్రీ అరవింద్ పి,
సి యం ఓ : మీనా చాబ్రియా,
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : జి.యం.కార్తికేయ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని