Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక్‌కు ఏమైంది..? శ్వాస సంబంధిత సమస్యతో..?

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:48 IST)
Karthik
సీతాకోకచిలుక, అభినందన, అన్వేషణ, మగరాయుడు లాంటి సినిమాలలో కనిపించిన నటుడు కార్తీక్‌ సుపరిచితుడే. అంతేకాదు మణిరత్నం ఘర్షణ మూవీ ఆయనకు తెలుగులో మంచి పేరు తెచ్చింది. అయితే ఈ సీనియర్‌ హీరో ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల బిజీలో ఉన్నారు.
 
బీజేపీ-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థుల తరఫున కార్తీక్‌ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగనే శనివారం రాత్రి ప్రచారం ముగించుకుని ఇంటికి చేరారు కార్తీక్‌. ఈ నేపథ్యంలో అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆస్పత్రి తరలించారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని వైద్యులు స్పష్టం చేశారు.
 
కార్తీక్ 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2018 లో ఏర్పడిన మణిద ఉరిమైగల్ కాక్కుం కట్చికి నాయకత్వం వహిస్తున్నారు. కార్తీక్ 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎఐఎడిఎంకెతో తన కూటమిని ప్రతిజ్ఞ చేసి, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎఐఎడిఎంకె నేతృత్వంలోని కూటమి కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments