Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్‌కుమార్ హిరానీ సినిమా రేంజ్‌లో వుంటుందిః కార్తికేయ

Advertiesment
Chavukaburu challaga
, గురువారం, 18 మార్చి 2021 (20:35 IST)
Karthikeya
`చావు కబురు చల్లగా` కోసం 2019 లోనే కాల్ వచ్చింది. అప్పుడే తెలిసింది గీతా ఆర్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని, ఇక అంతే మరో మాట లేకుండా ఓకే చేసేసాను. అది నా కెరీర్ కు ఖచ్చితంగా మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని బాగా నమ్ముతున్నాను. అల్లు అరవింద్ అంటే నేను ఆయన్ని మొట్ట మొదటిసారి కలిసే టైం లో చాలా భయపడ్డాను. కానీ ఆయనను మీట్ అయ్యాక ఆయన రియల్ లైఫ్లో ఎంత చిల్ గా ఉంటారో అర్ధం అయ్యింది. అలాంటి వారితో కలిసి పని చెయ్యడం నాకు నా కెరీర్ కు ఓ వరం లాంటిదే అని చెప్తా. ఇంకా వారితో ఫ్యూచర్ లో వర్క్ చెయ్యాలని కూడా కోరుకుంటున్నాన‌ని` హీరో కార్తికేయ అంటున్నారు. ఈ శుక్ర‌వార‌మే విడుద‌ల‌కానున్న ఈ సినిమా గురించి ఆయ‌న చెప్పిన విశేషాలు.
 
- ఈ సినిమాలో శవాలని తీసుకెళ్లే ఓ వాన్ డ్రైవర్ గా కనిపిస్తాను అలాంటి వ్యక్తి ఓ భర్తను పోగొట్టుకున్న అమ్మాయిని చూసి ప్రేమలో పడటం అనేది నాకు బాగా నచ్చింది. అదే అలా నా మైండ్ లో ఉంది సో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందని పైగా ఇలాంటి మాస్ రోల్ కూడా చెయ్యలేదు నేను సో ఇవన్నీ నేను ఈ సినిమా ఓకే చెయ్యడానికి కుదిరాయి. నేను ఫస్ట్ టైం కౌశిక్ ను చూసినప్పుడు గీతా ఆర్ట్స్ వాళ్ళు ఎవరినో పెళ్లి చూపులు లాంటి కథను చెప్పడానికి పంపారు అనుకున్నా కానీ ఒక్కసారి కౌశిక్ చావు కబురు చల్లగా కథ చెప్పిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. ఇందులో ఉండే ఎమోషన్, ఫిలాసఫీ లను కౌశిక్ చాలా బాగా చెప్పాడు.
 
- చావు నుంచి తప్పించుకోలేం, ఇందులో దానితోనే ఒక గొప్ప ఫిలాసఫీ కూడా ఉంటుంది. అలాగే చాలా ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఒక పక్క మంచి కామెడీ మరో పక్క ఎమోషన్స్ తో రాజ్కుమార్ హిరానీ గారి సినిమాల్లా ఇది కూడా ఉంటుంది. నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు మదర్ రోల్ లో ఎవరు ఎవరు చేస్తారు అని అడిగా అప్పుడే అనుకున్నాం ఆమని లాంటి లెజెండరీ నటి అయితే సరిపోతారు అని. దాంతో ఆమె నాకు మా డైరెక్టర్ కు గౌరవం ఇచ్చి ఈ సినిమాకు ఒప్పుకున్నారు. ఇన్నేళ్లు అయినా కూడా ఆమని గారు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు.
 
- స్క్రిప్ట్స్ ఎంపిక నాకు కొంచెం ఇబ్బంది గానే అనిపిస్తుంది. ఇండస్ట్రీలో నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కొన్ని నేను నా ఫ్రెండ్స్ సాయంతో ఓకే చేసేసాను. అందుకే కొన్ని సినిమాలు ప్లాప్స్ అయ్యాయ్.
 
- అజిత్ గారితో నాకు ఆఫర్ వచ్చింది అని విన్న టైంలో నా రెండు చేతులతో ఈ ఆఫర్ ను తీసుకున్నాను. అజిత్ గారితో సినిమా ఆయనతో కలిసి పని చెయ్యడం నాకు చాలా ఎగ్జైటెడ్ గా అనిపించాయి. ఆయనతో కలిసి సెట్స్ లో ఉండడమే గొప్ప బ్లెస్సింగ్ లా అనుకుంటాను. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ను లెక్చరర్‌గా చూపించనున్న హరీష్ శంకర్